తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోన్న రేవంత్ సర్కార్..

|

Jul 25, 2024 | 11:47 AM

తెలంగాణ పద్దుకు వేళయింది.. ఇవాళ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే.. ఓ వైపు కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్న రేవంత్‌ సర్కార్‌.. తెలంగాణ బడ్జెట్‌లో ఎన్నికల హామీలకు ఎలాంటి ప్రాధాన్యతలు ఇవ్వబోతుందనేది ఆసక్తి రేపుతోంది..

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది రేవంత్‌ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్‌ సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్‌ సమావేశమై.. తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత.. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్ధికమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనునుండగా.. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభకు ఒకరోజు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on