తెలుగు రాష్ట్రాలకు వానగండం..ఆ జిల్లాల్లో క్లౌడ్‌బరస్ట్‌ వీడియో

Updated on: Sep 13, 2025 | 3:11 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతవావరణ శాఖ. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్.. తూ.గో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా రానున్న నాలుగు రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్నిచోట్ల క్లౌడ్‌బరస్ట్‌ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం తెలంగాణ మొత్తానికి ఎల్లో అలర్ట్‌ కొనసాగుతుండగా.. ఇది గంటగంటకూ మారే అవకాశం కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. వాతావరణం ఆకస్మికంగా మారుతూ క్లౌడ్‌బరస్ట్‌, కుండపోత వానలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలో నిన్న వర్షాలు షేక్‌ చేశాయ్‌. ఆరేడు జిల్లాల్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్‌ కావడంతో మూడు నాలుగు గంటల్లోనే భారీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వీడియోల కోసం :

ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో

ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్‌ ఐడియా వీడియో

ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో

హైదరాబాద్‌ నుంచి 3 హై స్పీడ్ రైలు మార్గాలు వీడియో