విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..

Updated on: Feb 03, 2026 | 12:00 PM

తెలంగాణ ప్రభుత్వం ఆధార్ సేవల సరళీకరణకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం పాఠశాలల్లోనే ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు నిర్వహిస్తోంది. 5-15 ఏళ్ల వారికి తొలి బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం. కేంద్రం కొత్త ఆధార్ యాప్‌ను కూడా ప్రారంభించింది, దీనితో వివరాల మార్పులు, వెరిఫికేషన్ సులభతరం అయ్యాయి. ఈ రెండు మార్గాల ద్వారా ఆధార్ సేవలు మరింత చేరువయ్యాయి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఇది ఊరటనిస్తోంది.

ఆధార్ సేవల కోసం ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక విద్యార్థులకు ఉండదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ రిజిస్ట్రేషన్, అప్డేట్స్ కోసం పాఠశాలలకే ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు పంపాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 5 నుంచి 15 ఏళ్ల వయసు విద్యార్థులకు తొలి బయోమెట్రిక్ అప్డేట్‌ను పూర్తిగా ఉచితంగా చేస్తామని తెలిపారు. రెండోసారి బయోమెట్రిక్ అప్డేట్‌కు రూ.125, ఇప్పటికే ఉన్న ఆధార్‌లో వివరాల మార్పులకు రూ.75 ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేశారు. క్యాంపుల షెడ్యూల్ కోసం జిల్లా, మండల విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. స్కూల్‌లోనే ఆధార్ ప్రక్రియ పూర్తవుతుండటంతో పిల్లల చదువుకు ఆటంకం ఉండదని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఆధార్ వెరిఫికేషన్, అడ్రస్, మొబైల్ నంబర్ అప్డేట్ సులభంగా చేసుకోవచ్చు. అవసరమైన వివరాలనే షేర్ చేసే అవకాశం, ఒకే యాప్‌లో ఐదుగురి వరకు ప్రొఫైల్‌లు సృష్టించుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తంగా స్కూల్ క్యాంపులు, కొత్త యాప్‌తో ఆధార్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి

సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే

నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి

ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి

జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..