అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ ఛార్జర్.. 3 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. 100 కి.మీ. ప్రయాణించొచ్చు! వీడియో
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ చార్జర్ వచ్చేసింది. స్విస్ కంపెనీ ఏబీబీ తయారుచేసిన ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును 15 నిమిషాలకంటే తక్కువ టైంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ చార్జర్ వచ్చేసింది. స్విస్ కంపెనీ ఏబీబీ తయారుచేసిన ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును 15 నిమిషాలకంటే తక్కువ టైంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. అంతేకాదు ఈ ఛార్జర్‌తో ఎలక్ట్రిక్ కారును 3 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు 100 కి.మీ. ప్రయానిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఛార్జర్ పేరు టెర్రా 360 మాడ్యులర్, ఈ ఛార్జర్‌తో ఒకేసారి 4 వాహనాలను ఛార్జ్ చేయవచ్చట. ఏబీబీ టెర్రా 360 ఛార్జర్ లో ఉండే వినూత్న లైటింగ్ సిస్టమ్ వినియోగదారులకు ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్థితిని, ఈవీ పూర్తిగా ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని చూపుతుందట. దీనిని ఏర్పాటు చేసుకోడానికి ఎక్కవ స్థలం కూడా పట్టదట. ఇది చిన్న స్పేస్ పార్కింగ్, ఆఫీస్ కాంప్లెక్స్ లేదా మాల్ వంటి ఏదైనా వాణిజ్య ప్రదేశంలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చట.
మరిన్ని ఇక్కడ చూడండి: Allu Aravind-CM Jagan: తులచుకుంటే నువ్వు ఏదైనా చేయగలవు.. జగన్‌కు అరవింద్ స్వీట్ రిక్వెస్ట్..(వీడియో)