జనవరి 1 నుంచి వాట్సాప్‌ బంద్‌.. ఈ లిస్టులో మీ ఫోన్‌ ఉందా ??

Updated on: Dec 27, 2024 | 12:51 PM

ప్రముఖ ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ యూజర్లకు.. మెటా షాక్‌ ఇచ్చింది. జనవరి 1 నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్‌ పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్‌ పాత వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తోనే వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్‌ అప్‌డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్‌ల్లో పని చేయడం లేదని పేర్కొంది.

వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్‌డేట్లను పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్‌ల లిస్ట్‌కు ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఎస్4 మినీ ఫోన్లతో పాటు మోటరోలాకు చెందిన మోటో జి ఫస్ట్ జనరేషన్, రేజర్ హెచ్‌డీ, మోటో ఈ 2014కు చెందిన వేరియంట్‌ ఫోన్లలో వాట్సాప్‌ పని చేయదు. అలాగే హెచ్‌టీసీ వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601, ఎల్‌జీ ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90 డివైజ్‌ల్లో కూడా వాట్సాప్‌ సౌకర్యం ఉండదు. ఇక సోనీ ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్‌పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీ, యాపిల్‌ ఓఎస్‌లోనూ జనవరి మొదటి రోజు నుంచే వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉండవని మెటా తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాలు మోపితే కాటికే.. భయంకరమైన మృత్యు గుహ !!

ఈ పాలు ఒక్క గ్లాసు తాగితే చాలు !! మీ ఆరోగ్యానికి తిరుగులేదు !!

ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి డింగా డింగా

పెళ్లి స్టైల్ మారుతోంది.. వెల్ కం చెప్పాలా ?? రిజెక్ట్ చేయాలా ??

శ్రీతేజ్‌ కుటుంబానికి జానీ మాస్టర్ భరోసా