Toyota Heading To Moon: చంద్రుడిపైకి దూసుకెళ్లనున్న టయోటా కారు
చంద్రుడిపై మానవుడు నివసించేందుకు అనువైన ప్రదేశం ఉందా.? లేదా..? అన్నదానిపై ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తు వినూత్న ప్రయత్నాలు చేయడానికి మొదలు పెడుతున్నారు.
చంద్రుడిపై మానవుడు నివసించేందుకు అనువైన ప్రదేశం ఉందా.? లేదా..? అన్నదానిపై ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తు వినూత్న ప్రయత్నాలు చేయడానికి మొదలు పెడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చంద్రుడిపై అన్వేషణ కోసం ఒక సరికొత్త వాహనాన్ని రూపొందించేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా రెడీ అయ్యింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ఫ్లోరేషన్ ఏజెన్సీతో కలిసి టయోట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2040 నాటికి చంద్రుడిపైన,అంగారకుడిపైన ప్రజలు నివసించడానికి అన్ని పరిస్థితులను అన్వేషించడానికి, ఓ కారును రెడీ చేస్తోంది టయోట సంస్థ.
వైరల్ వీడియోలు
Latest Videos