Truecaller: మీకు ఫోన్‌ చేసింది ఎవరో తెలుసుకోవాలంటే.. ఇక ట్రూ కాలర్‌తో పనిలేదు.!

|

Feb 27, 2024 | 7:38 AM

ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ పెరిగిపోవడంతో ఫోన్ చేసేది ఎవరో తెలుసుకునేందుకు ‘ట్రూకాలర్’ లాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే, ఇకపై ఆ బాధ తప్పినట్టే. యాప్స్‌తో సంబంధం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో ఇకపై స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఇందుకు సంబంధించి టెలికం ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ చేసిన ప్రతిపాదనలు త్వరలోనే అమలులోనికి రానున్నాయి.

ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ పెరిగిపోవడంతో ఫోన్ చేసేది ఎవరో తెలుసుకునేందుకు ‘ట్రూకాలర్’ లాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే, ఇకపై ఆ బాధ తప్పినట్టే. యాప్స్‌తో సంబంధం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో ఇకపై స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఇందుకు సంబంధించి టెలికం ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ చేసిన ప్రతిపాదనలు త్వరలోనే అమలులోనికి రానున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రెండేళ్ల క్రితం చేసిన ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. ఇప్పుడు దీనిని తప్పనిసరి చేసింది. వినియోగదారుల అభ్యర్థన మేరకు సప్లిమెంటరీ సర్వీస్‌గా అన్ని టెల్కోలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ CNAPని అందించాలని ట్రాయ్ తన చివరి సిఫార్సుల సెట్‌లో ప్రతిపాదించింది. అయితే, ఈ సర్వీసులు ఇండియాలో డిఫాల్ట్‌గా అందుబాటులోకి రానున్నాయి. సిమ్‌కార్డు తీసుకున్నప్పుడు నమోదు చేసుకున్న పేరు కాల్ చేసేటప్పుడు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. యూజర్ అభ్యర్థనపై మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..