అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

|

Apr 25, 2024 | 8:02 PM

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. అనంత విశ్వంలోని రహస్యాలను తెలుసుకొనేందుకు 1977లో ప్రయోగించిన వోయేజర్–1 స్పేస్ షిప్ కొన్ని నెలల మౌనం తర్వాత మళ్లీ స్పందించింది. భూమికి సుమారు 2,400 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి “హాయ్.. నేనే వీ1ను” అంటూ నాసాకు సందేశం పంపింది. నాసా గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ కు సమాచారాన్ని చేరవేసింది. ఈ విషయాన్ని నాసా వోయేజర్–1 ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. అనంత విశ్వంలోని రహస్యాలను తెలుసుకొనేందుకు 1977లో ప్రయోగించిన వోయేజర్–1 స్పేస్ షిప్ కొన్ని నెలల మౌనం తర్వాత మళ్లీ స్పందించింది. భూమికి సుమారు 2,400 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి “హాయ్.. నేనే వీ1ను” అంటూ నాసాకు సందేశం పంపింది. నాసా గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ కు సమాచారాన్ని చేరవేసింది. ఈ విషయాన్ని నాసా వోయేజర్–1 ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. గత 46 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న వోయేజర్–1, నవంబర్ 14, 2023 తర్వాత కంట్రోల్ సెంటర్ కు సమాచారం పంపడం ఆపేసింది. కానీ స్పేస్ షిప్ కంట్రోలర్ల నుంచి ఆదేశాలు స్వీకరిస్తూనే ఉంది. వోయేజర్–1లోని ఒక మెమొరీ చిప్ సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ బృందాలు ఈ ఏడాది మార్చిలో గుర్తించాయి. ఆ చిప్ ను కోడింగ్ ద్వారా సరిచేశాయి. దీంతో అది తిరిగి సమాచారం పంపడం మొదలు పెట్టింది. వోయేజర్–1 కీలక డేటాను తిరిగి పంపుతోంది. దాని ప్రస్తుత పనితీరు గురించి వివరించడంతోపాటు అందులోని పరికరాలు ఎలా పనిచేస్తున్నాయో సమాచారం పంపింది. ఇక తదుపరి అడుగు స్పేస్ క్రాఫ్ట్ సేకరించిన సైన్స్ డేటాను పంపేలా చేయడమే అని నాసా తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ?? అయితే మీరు ఈ వ్యాధి బాధితులు కావచ్చు !!