దోమలకు దోమలతోనే చెక్.. ఆస్ట్రేలియాలో సరికొత్త ప్రయోగం!
చలికాలం వచ్చిందంటే వైరస్‌లు విజృంభిస్తాయి. ఎక్కువగా ఈ వ్యాధులు దోమలద్వారానే వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు దోమలనుంచే సంక్రమిస్తాయి. ఈ క్రమంలో దోమల బెడదనుంచి రక్షించుకోడానికి మనుషులు రకరకాల ప్రయోగాలు చేస్తారు. దోమలను నివారించే కాయిల్స్, లిక్విడ్స్, స్ప్రేలు ఉపయోగిస్తారు.
వీటి కారణంగా ప్రజలు సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతుంటారు. వీటన్నిటికీ చెక్‌పెట్టాలనే యోచనతో ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలి… వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా దోమలను దోమలతోనే అరికట్టే ప్రయోగం చేశారు. ఇళ్లు, పరిసరప్రాంతాల్లో నీరు నిల్వడం, పారిశుద్ధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు అది ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాధులు సోకడానికి ప్రధాన కారణమైన ఆడ దోమలకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేపట్టారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వల్ల విజృంభిస్తోన్న డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలి వల.. 50 టన్నుల చేపలు చిక్కాల్సిందే..
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
బీర్ల ప్రియులకు షాక్.. కింగ్‌ఫిషర్ షాకింగ్ డెసిషన్
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..