దట్టమైన మంచులోనూ రైళ్లు దూసుకుపోయే టెక్నాలజీ !!

|

Dec 25, 2024 | 1:30 PM

రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రైళ్లలో కవచ్‌ పేరుతో ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ ను ఎప్పుడో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ చాలా సమర్థంగా పనిచేస్తోందని ఇప్పటికే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చాలాసార్లు చెప్పారు.

కవచ్‌ పనితీరుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఆయన పోస్ట్‌ చేశారు. కవచ్‌ వ్యవస్థ సాయంతో దట్టమైన పొగమంచులోనూ పట్టాలపై రైలు దూసుకెళ్తున్న వీడియో అది. లోకో పైలెట్‌ బయటకు చూడకుండానే కవచ్‌ సాయంతో సిగ్నల్‌ సమాచారం తెలుసుకోవచ్చని కేంద్రమంత్రి రాసుకొచ్చారు. సాధారణంగా విపరీతమైన పొగమంచు ఉన్పప్పుడు లోకో పైలట్‌కు ఒక్కోసారి సిగ్నల్‌ కూడా కన్పించని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువ. ఇప్పుడు కవచ్‌తో ఆ సమస్య ఉండబోదని రైల్వే మంత్రి వివరించారు. ఈ వ్యవస్థ సాయంతో బయట ఏం సిగ్నల్‌ పడిందనేది క్యాబిన్‌లోని మానిటర్‌పైనే లోకో పైలట్‌ చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..

అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??

ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ?? రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయా ??