అంతరిక్షంలో వ్యోమగామికి అనారోగ్యం !! ఇప్పుడెలా ?? నాసా ఏం చేయబోతుంది

Updated on: Jan 12, 2026 | 4:08 PM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) ఓ వ్యోమగామికి వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తడంతో నాసా కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యంతో ఉన్న వ్యోమగామిని భూమికి తిరిగి తీసుకురావాలని నిర్ణయించి, జనవరి 14న క్రూ-11 మిషన్ అన్‌డాకింగ్‌కు షెడ్యూల్ చేసింది. ఈ అరుదైన ఘటన కారణంగా మొదటి స్పేస్‌వాక్ వాయిదా పడింది. ఐఎస్‌ఎస్‌ చరిత్రలో ఇలా మిషన్‌ను ముగించడం ఇదే తొలిసారి.

భూమ్మీద ఎవరికైనా అనారోగ్యం చేస్తే చికిత్స అందించేందుకు వైద్యులు, ఆస్పత్రులు ఉంటాయి. అదే అంతరిక్షంలో అనారోగ్యం చేస్తే ఏంటి సంగతులు? యస్‌.. ఆ డౌటునుమానం ఇప్పుడెందుకొచ్చిందనేగా మీ డౌటనుమానం. ఏం లేదండీ.. ఇటీవల ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌‌కు వెళ్లిన అదే మనం ముద్దుగా పిలుచుకునే ఐఎస్‌ఎస్‌లో ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తిందట. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నలుగురు వ్యోమగాముల్లో ఒకరికి ఆనారోగ్యం సంభవించింది. ఈ క్రమంలో నాసా కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యానికి గురైన వ్యోమగామిని భూమ్మీదకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు చేసింది నాసా. జనవరి 14న క్రూ-11 మిషన్‌ అన్‌డాకింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు నాసా ప్రకటించింది. జనవరి 15న కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల ల్యాండింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో నలుగురు వ్యోమగాములు క్రూ-11 మిషన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్‌ చేయనున్నట్లు నాసా ఇటీవల ప్రకటించింది. జనవరి 8న వ్యోమగాములు 6.5 గంటల పాటు స్పేస్‌వాక్‌ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, చివరి నిమిషంలో దీన్ని నాసా నిలిపివేసింది. క్రూ-11 మిషన్‌లో వెళ్లిన ఓ వ్యోమగామికి మెడికల్‌ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్‌వాక్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఐఎస్‌ఎస్‌లో ఆ వ్యోమగామికి ఎలాంటి గాయం కాలేదని, ప్రస్తుతం వ్యోమగామి ఆరోగ్యం నిలకడగా ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అత్యవసర తరలింపు అవసరం లేదని చెప్పారు. నిజానికి ఈ నెలలో రెండుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో స్పేస్‌వాక్‌ నిర్వహించాలని నాసా ప్రణాళికలు చేపట్టింది. జనవరి 8వ తేదీతో పాటు 15న వీటిని నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పుడు తొలి స్పేస్‌వాక్‌ వాయిదా పడటంతో రెండో షెడ్యూల్‌ పైనా ప్రభావం పడే అవకాశం కన్పిస్తోంది. అయితే అంతరిక్ష కేంద్రంలో వైద్య సమస్యలు తలెత్తడం చాలా అరుదుగా చెబుతున్నారు. షెడ్యూల్‌ సమయానికంటే ముందుగానే ఒక మిషన్‌ ను ముగించడం ఐఎస్‌ఎస్‌ 25 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు

Shreyas Iyer: కుక్క దాడి.. షాక్‌లో శ్రేయస్ అయ్యర్

Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Weather Update: సంక్రాంతి వేళ వర్ష సూచన ఆ జిల్లాలకు ఐఎండీ అలర్ట్

Andhra Pradesh: పందెం రాయుళ్లకు షాక్ !! కలెక్టర్లు,ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు