కృత్రిమ మేధతో ఉద్యోగాలు మాయం !! ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు పోతాయి !!

|

Jan 16, 2024 | 7:18 PM

కృత్రిమ మేధ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఉద్యోగాలపై ప్రభావం తప్పకుండా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ తాజా నివేదికలో పేర్కొంది. ఉద్యోగాలపై పాజిటివ్ గానో లేదా నెగటివ్ గానో.. మొత్తానికి ఏదో ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం తప్పకుండా ఉంటుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవ చెప్పారు. కృత్రిమ మేధ రెండు వైపులా పదునైన కత్తిలాంటిదని అన్నారు. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు గల్లంతవుతాయని ఆమె అంచాన వేస్తున్నారు.

కృత్రిమ మేధ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఉద్యోగాలపై ప్రభావం తప్పకుండా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ తాజా నివేదికలో పేర్కొంది. ఉద్యోగాలపై పాజిటివ్ గానో లేదా నెగటివ్ గానో.. మొత్తానికి ఏదో ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం తప్పకుండా ఉంటుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవ చెప్పారు. కృత్రిమ మేధ రెండు వైపులా పదునైన కత్తిలాంటిదని అన్నారు. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు గల్లంతవుతాయని ఆమె అంచాన వేస్తున్నారు. అయితే, ఏఐతో సానుకూల ప్రభావాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. ఉత్పాదకత, అభివృద్ధికి కృత్రిమ మేధ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. కొన్ని ఉద్యోగాలు పోవచ్చు కానీ మిగతా ఉద్యోగాలను మరింత మెరుగు పరుస్తుందని, ఆదాయ స్థాయులను పెంచుతుందని క్రిస్టాలినా పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Amitabh Bachchan: 10 వేల చదరపు గజాల స్థలం ఖరీదు రూ.14.5 కోట్లు

వందలాది వీధి కుక్కలతో సంక్రాంతి సంబరాలు

ఉచిత 5జీ డేటా ఇక లేనట్లే.. ఎందుకంటే ??

హనుమాన్‌ టీం నుంచి గుడ్ న్యూస్.. ఇక తెలంగాణలో బీభత్సమే

Prasanth Varma: ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ అది వాళ్లను ఉద్దేశించేనా ??