బ్రతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు.. నేనున్నా అంటూ ప్రాణం పోసిన ‘ఏఐ’

Updated on: Apr 02, 2025 | 1:57 PM

అరుదైన వ్యాధితో మరణం అంచున ఉన్న ఒక అమెరికన్ పౌరుడికి ఏఐ పునర్జన్మ ప్రసాదించింది. వైద్యులు చేతులెత్తేసిన వేళ, వినూత్న వైద్యంతో ప్రాణాలను నిలబెట్టింది. అమెరికాలోని వాషింగ్టన్ లో చోటుచేసుకుందీ అద్భుతం. వైద్యరంగంలో ఏఐ ప్రాముఖ్యతను చాటి చెబుతోందీ ఘటన. అమెరికన్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జోసెఫ్ కోట్స్ అత్యంత అరుదైన పోయెమ్స్ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు.

ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా జోసెఫ్ శరీరంలో ఒక్కో భాగం చచ్చుబడిపోతోంది. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. గుండె వ్యాకోచించింది. మూత్రపిండాలు ఫెయిలయ్యాయి. ఈ పరిస్థితిలో సంప్రదాయ వైద్యం పనిచేయడంలేదని, జోసెఫ్ బ్రతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. అటు వైద్యులు, ఇటు జోసెఫ్ కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. అయితే, జోసెఫ్ ప్రియురాలు తారా థెబాల్డ్ మాత్రం దీనిని సీరియెస్‌గా తీసుకుంది. వైద్యరంగంలో కృత్రిమ మేధ సాయంపై పరిశోధన చేస్తున్న ఫిలదెల్ఫియా వైద్యుడు డాక్టర్ డేవిడ్ ను ఆశ్రయించింది. జోసెఫ్ పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలంటూ ఈమెయిల్ పంపింది. ఈ వివరాలతో డాక్టర్ డేవిడ్ కృత్రిమ మేధ సాయాన్ని అర్థించారు. ఏఐ సూచనలతో జోసెఫ్ ట్రీట్ మెంట్ మార్చాలని వైద్యులకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌

ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?

Whatsapp: ఫోటో కొట్టు.. వీడియో పట్టు.. వాట్సాప్‌లో మరో అమేజింగ్‌ ఫీచర్‌

తెల్లవారుజామున వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. నెట్టింట వీడియో వైరల్‌

కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్‌లో పడ్డ సిరాజ్‌ ??