చందమామ అసలు రూపం బయటపెట్టిన విక్రమ్ ల్యాండర్ !!
భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై దిగిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన పరికరం ప్రజ్ఞాన్ రోవర్. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అప్పుడే పని ప్రారంభించింది. చల్లని వెన్నెల కురిపించే చందమామ అసలు రూపాన్ని బయటపెట్టింది. చంద్రుడి వాతావరణంలో ఉండే వేడిని కొలిచింది. అదేంటి జాబిల్లి వెచ్చగా ఉంటుందా అనిపిస్తుంది కదా.. అవును చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 50 డిగ్రీలు ఉన్నట్టు గుర్తించింది.
భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై దిగిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన పరికరం ప్రజ్ఞాన్ రోవర్. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అప్పుడే పని ప్రారంభించింది. చల్లని వెన్నెల కురిపించే చందమామ అసలు రూపాన్ని బయటపెట్టింది. చంద్రుడి వాతావరణంలో ఉండే వేడిని కొలిచింది. అదేంటి జాబిల్లి వెచ్చగా ఉంటుందా అనిపిస్తుంది కదా.. అవును చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 50 డిగ్రీలు ఉన్నట్టు గుర్తించింది. అంతేకాదు, చంద్రుడి ఉపరితలంపై పది సెంటీమీటర్ల లోతులోనూ ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసుకునే సామర్థ్యం ప్రజ్ఞాన్ రోవర్ కు ఉంది. ఇది 8 సెంటీమీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు గుర్తించింది. ఈ మేరకు సేకరించిన డేటాను విక్రమ్ ల్యాండర్ ద్వారా భూమికి చేరవేసింది. ఓ గ్రాఫ్ రూపంలో ఈ సమాచారాన్ని అందించింది. దీనిపై ఇస్రో ఓ ప్రకటన చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయన్న దానిపై ఇప్పటివరకు ఇదే తొలి సమాచారం అని వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లలు స్కూల్ డుమ్మా కొడితే తల్లిదండ్రులకు జైలు శిక్ష
హైదరాబాద్‌లో ఇటుక బిర్యానీ.. తింటే యమ రుచిలే !!
లారీ చక్రాలమధ్య నిల్చుని యువకుడు స్కేటింగ్ !!
చంద్రుడిపై బెంగళూరు యువకుడు ?? నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో
ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడు.. ఆ తర్వాత ??