ఐదేళ్ల కిందట టిక్‌టాక్‌ పై నిషేధం..భారత్‌లోకి మళ్లీ ఎంట్రీ? వీడియో

Updated on: Aug 27, 2025 | 12:44 PM

చైనాకు చెందిన ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ సేవలు భారత్‌లోకి రీఎంట్రీ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. భారత్, చైనా దౌత్య బంధం పునరుద్ధరణ వేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా అమల్లోనే ఉందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఈ ప్రచారానికి తెర పడినట్లయింది. గతంలో తూర్పు లఢఖ్‌లోని గల్వాన్ లోయలో ఉద్రిక్తతల అనంతరం.. 2020లో కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్‌తో పాటు వందలాది చైనా యాప్స్ నిషేధిత జాబితాలో ఉన్నాయి.

భారత్‌లో ఏదోవిధంగా కొనసాగేందుకు శాయశక్తులా ప్రయత్నించిన టిక్‌ టాక్‌ కంపెనీ ఎట్టకేలకు 2023 ఫిబ్రవరి 28న మూతపడింది. అప్పటి నుంచి భారత్‌లో అందుబాటులో లేదు. అయితే, ట్రంప్‌ సుంకాల మోతతో అమెరికా-భారత్‌ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారతీయ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం సుంకాలు విధించినప్పటి నుంచి భారత్‌, చైనా మధ్య సంబంధాలలో పురోగతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఐదేళ్ల తర్వాత టిక్‌టాక్ భారత్‌లోకి రీఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. టిక్‌టాక్, షీన్ వంటి చైనా యాప్‌ల మీద ఇండియాలో నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టం చేసింది. దీంతో భారత్‌లోకి టిక్‌టాక్ రీ ఎంట్రీ అనే వార్తలకు చెక్ పడింది. మరి ఇంతకు ఈ ప్రచారం ఎందుకు తెర మీదకు వచ్చిందంటే.. ప్రస్తుతం ఇండియా, చైనా మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమంటున్నారు. కానీ ప్లేస్టోర్‌‌లో మాత్రం ఇప్పటి వరకు టిక్‌టాక్ యాప్ కనిపించలేదు. ఇప్పుడు కేంద్రం కూడా వీటిపై నిషేధం కొనసాగుతుందని క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడింది.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో