Cancer: వైద్య చరిత్రలో సంచలనం.. 7 నిమిషాల్లో కేన్సర్‌కు చికిత్స.. వీడియో.

Updated on: Sep 04, 2023 | 9:59 AM

ప్రపంచంలో ఇప్పుడు కేన్సర్ సాధారణంగా మారిపోయింది. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులతో పాటు పెరుగుతున్న వాయు కాలుష్యం వంటివి కేన్సర్‌కు కారకాలుగా మారుతున్నాయి. ఇదే సమయంలో కేన్సర్ చికిత్స అంటే ఖర్చుతో కూడుకున్నదని చాలామంది భయపడతారు. అయితే, అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చి.. చికిత్స కాలాన్ని, ఖర్చును కూడా తగ్గిస్తున్నాయి.

ప్రపంచంలో ఇప్పుడు కేన్సర్ సాధారణంగా మారిపోయింది. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులతో పాటు పెరుగుతున్న వాయు కాలుష్యం వంటివి కేన్సర్‌కు కారకాలుగా మారుతున్నాయి. ఇదే సమయంలో కేన్సర్ చికిత్స అంటే ఖర్చుతో కూడుకున్నదని చాలామంది భయపడతారు. అయితే, అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చి.. చికిత్స కాలాన్ని, ఖర్చును కూడా తగ్గిస్తున్నాయి. తాజాగా, ఇంగ్లాండ్ మరో అద్భుత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తాజాగా, ఏడు నిమిషాల్లోనే చికిత్స పూర్తయ్యే ఔషధాన్ని, సెవెన్‌ మినిట్‌ జాబ్‌ను బ్రిటన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు 29న 100 మంది కేన్సర్ రోగులకు ప్రయోగాత్మకంగా అందజేసారు. కేన్సర్ రోగికి ఇచ్చే ఇంజెక్షన్ సమయాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు బ్రిటన్ హెల్త్ సర్వీసెస్ ఆమోదం తెలిపింది. దీని వల్ల కేన్సర్ చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. కేన్సర్ బాధితులకు ఇమ్యునోథెరపీలో భాగంగా అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను డ్రిప్ ద్వారా చర్మం కింద ఇస్తారు. ఇందుకు 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. కానీ తాజాగా ఆమోదించిన ఔషధాన్ని కేవలం 7 నిమిషాల్లోనే ఇవ్వొచ్చు. కేన్సర్ రోగులకు, వైద్యులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..