Aliens: భూమిపై ఉన్న అణు స్థావరాలపై ఏలియన్స్‌ నిఘా

Updated on: Nov 05, 2025 | 4:36 PM

ఈ విశ్వంలో మనుషులను పోలిన గ్రహాంతర వాసులు ఉన్నారా? అనే ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎలియన్స్‌ కచ్చితంగా ఉన్నారని.. మనుషుల మీద ఓ కన్నేసి ఉంచారని పరిశోధకుల వాదన. తాజాగా స్వీడన్‌ పరిశోధకులు మరో సంచలన నివేదిక బయటపెట్టారు. భూమిపైన జరుగుతున్న ప్రమాదకరమైన అణు కార్యకలాపాలపై గ్రహాంతరవాసులు నిఘా పెట్టి ఉండవచ్చని తేల్చి చెప్పారు.

స్వీడన్‌లోని నోర్డిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ థియరిటికల్‌ ఫిజిక్స్‌కు చెందిన డాక్టర్‌ బీట్రిజ్‌ విల్లరోయెల్‌ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. అణు శకం ప్రారంభ సమయంలో జరిగిన అణు పరీక్షలను మానవేతర నిఘా పరిశీలించి ఉండవచ్చని ఈ నివేదిక పేర్కొంది. 1949 నుంచి 1957 మధ్య కాలంలో అమెరికా, బ్రిటన్‌, సోవియట్‌ యూనియన్‌ అణు పరీక్షలను నిర్వహించాయి. ఆ సమయంలో ఆకాశంలో వింత సంఘటనలు జరిగినట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ సంఘటనలను ట్రాన్సియెంట్స్‌.. అంటే తాత్కాలిక అతిథులుగా పేర్కొంది. ఖగోళ చిత్రాల్లో ఈ ట్రాన్సియెంట్స్‌ అకస్మాత్తుగా, నక్షత్రాల వంటి వెలుగుతో కనిపించినట్లు తెలిపింది. ఇవి కనిపించినంత వేగంగానే మాయమైపోయాయని వివరించింది. అణు పరీక్ష జరగడానికి కాసేపటి ముందు, తర్వాత ఈ గుర్తు పట్టలేని ప్రకాశవంతమైన వస్తువులు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు. కాలిఫోర్నియాలోని పలోమార్‌ అబ్జర్వేటరీ స్కై సర్వేలో ఉన్న వేలాది చారిత్రక ఫొటోలను ఈ అధ్యయనంలో పరిశోధకులు విశ్లేషించారు. భూమి ఉపరితలంపై నిర్వహించిన 124 అణు పేలుళ్ల చిత్రాలు కూడా వీటిలో ఉన్నాయి. భూగర్భంలో పరీక్షలకు ప్రామాణికత లభించడానికి ముందు భూమి పైభాగంలో నిర్వహించిన పరీక్షల వల్ల రేడియోధార్మికత, ప్రకంపనలు వాతావరణంలోకి విడుదలయ్యాయి. ఈ ట్రాన్సియెంట్స్‌ సమతులంగా, అద్దం మాదిరిగా, గిరగిరా తిరుగుతూ, ఫ్లయింగ్‌ సాసర్‌ ఆకారంలో ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. శాస్త్రవేత్తలు తమ పరిశీలనలో లక్షకు పైగా ట్రాన్సియెంట్లను గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే

టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. పాపం.. అంతలోనే

ట్రక్కు నిండా కరెన్సీ నోట్లు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగరేశాడు

సెలెబ్రిటీల వెంట పోకిరీల తంటా.. ఆన్‌లైన్ వేధింపులకు గురైన నటి

పాకిస్తాన్ ను వణికించే విధంగా త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు