Taraka Ratna: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తారకరత్న తల్లిదండ్రులు

| Edited By: Ram Naramaneni

Feb 20, 2023 | 11:31 AM

నిండా 39 సంవత్సరాల వయసు..ఆప్యాయంగా , ప్రతీ ఒక్కరినీ ప్రేమగా పలకరించే మనస్తత్వం..తారకరత్న ఇప్పుడు మన మధ్య లేరు.రాజకీయంగా సరికొత్త అడుగులు మొదలుపెట్టారు. భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్న తారకరత్న..ఇప్పుడు చుక్కల్లో కలిసి పోయారు.

మోకిలాకు చేరుకున్న నందమూరి కుటుంబసభ్యులు, తారకరత్న పార్థివదేహానికి క్రతువు పూర్తి చేశారు. నందమూరి అభిమానుల కోసం మరికాసేపట్లో తారకరత్న పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్‌కు తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత..జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అకాల మరణం చెందడంతో తట్టుకోలేక అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కాళ్లు, చేతుల్లో వణుకు రావడంతో పాటు..కొంత మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. అలేఖ్య ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడినట్టుగానే కనిపిస్తోంది. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ బాలకృష్ణ మనోధైర్యం నింపారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, చంద్రబాబు, లోకేశ్. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అచేతనంగా పడివున్న కుటుంబ సభ్యుడను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 20, 2023 09:18 AM