నేను బతికే అవకాశం లేదు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో.. జవాన్ ఆవేదన
అనంతనాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలోని గడోలే అటవీ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన జమ్మూకశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ భట్ చివరి క్షణాల్లో భార్యతో మాట్లాడిన మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు విడిచిపెట్టడానికి ముందు కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. తన నెల వయసున్న కుమారుడిని చూడాలని ఆరాటపడ్డారు.
అనంతనాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలోని గడోలే అటవీ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన జమ్మూకశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ భట్ చివరి క్షణాల్లో భార్యతో మాట్లాడిన మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు విడిచిపెట్టడానికి ముందు కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. తన నెల వయసున్న కుమారుడిని చూడాలని ఆరాటపడ్డారు. భార్య ఫాతిమాకు ఫోన్ చేసిన భట్.. నేను బతికే అవకాశం లేదు… బాబును జాగ్రత్తగా చూసుకో.. అని ఆ వీడియో కాల్‌లో భార్యకు జాగ్రత్తలు చెప్పారు. మరో 15 రోజుల్లో వారు వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో అమరుడైన డీఎస్పీ హుమయూన్ భట్‌కు ఆయన స్వగ్రామమైన బుద్గాంలోని హుమ్‌హమాలో సెప్టెంబర్ 13 సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10 రోజులు లీవ్ అడిగిన ఎంప్లాయ్.. 2 నిమిషాల్లో ఓకే చెప్పిన బాస్..
వేలానికి ప్రిన్సెస్ డయానా స్వెట్టర్.. ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా ??
విశాఖ తీరంలో అరుదైన చేప గుర్తింపు.. దీని ప్రత్యేకత ఏంటంటే ??
Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్..