LMV Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.! LMV లైసెన్స్ ఉందా? అయితే మీరు..
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడమే దీనికి కారణమంటూ ఇటీవల వస్తున్న ఆరోపణలను కోర్టు ప్రస్తావించింది. ఈ రెండింటికీ సంబంధం లేదని తెలిపింది. మోటారు వాహనాల చట్టం 1988లో పేర్కొన్న అదనపు అర్హత ప్రమాణాలు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం మధ్యస్త, భారీ రవాణా వాహనాలు 7,500 కేజీల కంటే ఎక్కువ స్థూల బరువు కలిగిన ప్రయాణికుల వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
డ్రైవింగ్ లైసెన్స్‌లపై సుప్రీంకోర్టు కీలకతీర్పు వెల్లడించింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో 7500 కిలోల లోపు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చు అని తీర్పులో స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. 7500 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న రవాణా వాహనాన్ని నడిపేందుకు ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదని తీర్పునిచ్చింది. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనం నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణమనే వాదనను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన డేటా లేదని తెలిపింది. 7,500 కిలోల లోపు ఉన్న రవాణా వాహనాలను నడిపేందుకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎల్ఎంవీ కేటగిరీలోని ట్రాన్స్‌పోర్టు వాహనాలను డ్రైవ్ చేసేవారికి ప్రత్యేకంగా ఎలాంటి లైసెన్సు అవసరం లేదు. 7,500 కేజీల లోపు బరువున్న వాహనాలను కూడా ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడపవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.