Onion Price: అక్కడ ఉల్లి చాలా చౌక.. కేవలం కిలో రూ.25లకే

|

Nov 10, 2023 | 8:47 PM

ఉల్లిపాయలు కొయ్యకుండానే కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ధరలతో ఉల్లిమాట ఎత్తాలంటే భయపడుతున్నారు సామాన్యులు. ఉల్లిపాయ లేనిదే కూరలు చేయడం దాదాపు సాధ్యం కాదు. మరి ఉల్లి పాయల ధర చూస్తే కొండెక్కి కూర్చుంది. 80 రూపాయలు పెడితేకానీ కిలో ఉల్లిపాయలు రావడంలేదు. ఇటు కూరగాయల ధరలూ పెరిగిపోయి, అటు ఉల్లిపాయల రేట్లూ పెరిగిపోతే సామాన్యులు ఏమి కొనాలి తినాలి? ఏమి తినాలి?

ఉల్లిపాయలు కొయ్యకుండానే కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ధరలతో ఉల్లిమాట ఎత్తాలంటే భయపడుతున్నారు సామాన్యులు. ఉల్లిపాయ లేనిదే కూరలు చేయడం దాదాపు సాధ్యం కాదు. మరి ఉల్లి పాయల ధర చూస్తే కొండెక్కి కూర్చుంది. 80 రూపాయలు పెడితేకానీ కిలో ఉల్లిపాయలు రావడంలేదు. ఇటు కూరగాయల ధరలూ పెరిగిపోయి, అటు ఉల్లిపాయల రేట్లూ పెరిగిపోతే సామాన్యులు ఏమి కొనాలి తినాలి? ఏమి తినాలి?.. అని ఉసూరుమంటున్న సామాన్యుకు కాస్త ఊరట కలిగిస్తూ ప్రభుత్వం 25 రూపాయలకే కిలో ఉల్లిపాయలు అందిస్తోంది. దాంతో మనోళ్లు సంచులు తీసుకొని ఎగబడ్డారు. క్యూలైన్లో కుస్తీపట్టిమరీ ఉల్లిపాయలు కొనుక్కెళ్తున్నారు. ఉల్లిపాయల కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో రాయితీపై ఉల్లిపాయలను పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ -(NCCF) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తుంది. రాయితీ ఉల్లిని కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ సరఫరా చేస్తోంది. కిలో 25 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి నాలుగు కిలోల ఉల్లిని ఇస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూగోళంపై అరుదైన దృశ్యం.. సూర్యుడి ఉపరితలంపై సౌర తుఫాను

ప్రాణం తీసిన రోబో.. కూరగాయల బాక్స్‌ అనుకొని !!

గాజా సిటీలో ప్రతి వీధిలో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం

వరదలో బస్సు.. తాళ్లసాయంతో బయటకొచ్చిన ప్రయాణీకులు

తొలి విడత గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి అదిరిపోయే రిటర్న్స్‌