జస్ట్ ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాస్తే తెల్ల జుట్టు మాయం

Updated on: Dec 01, 2025 | 6:15 PM

అందమైన నల్లని జుట్టు కోసం ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు! తెల్లజుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలకు ఇంట్లో దొరికే ఉసిరి పొడి, కొబ్బరి నూనె అద్భుత పరిష్కారం. ఈ సహజ మిశ్రమం జుట్టు మూలాలను బలోపేతం చేసి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది మీ జుట్టును నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా మారుస్తుంది. ఈ సులభ పద్ధతితో మీరు కోరుకున్న జుట్టును సొంతం చేసుకోండి.

అందమైన, పొడవైన ఒత్తయిన నల్లని జుట్టు కావాలని మహిళలంతా కోరుకుంటారు. ఇందు కోసం చాలామంది ఖరీదైన ప్రొడక్ట్స్‌ వాడుతారు. కానీ వాటితో పనిలేకుండా సహజంగా మీరు కోరుకునే విధంగా జుట్టును సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే ఈ సమస్యకు మనం చెక్‌ పెట్టవచ్చంటున్నారు. ప్రస్తుత కాలంలో అందరినీ వేధించే సమస్య తెల్లజుట్టు. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపిస్తుంది. దీనికి సహజసిద్ధమైన పరిష్కారం సూచిస్తున్నారు నిపుణులు. కొబ్బరి నూనెలో ఉసిరి పొడి కలిపి తలకు పట్టిస్తే తెల్లజుట్టు సమస్య తగ్గుతుందట. ఆమ్లాలో జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్లు E, K ఉంటాయి. ఆమ్లా పొడిని కొబ్బరి నూనెతో కలిపి తకు రాయడం వల్ల తల చర్మం, జుట్టు మూలాలు బలపడతాయి. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ పొడిని జుట్టుకు రాయడం వల్ల జుట్టు త్వరగా , పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఇది జుట్టును నల్లగా మెరిసేలా చేస్తుంది. ఉసిరి పొడి, కొబ్బరి నూనె రెండింటిలోనూ జుట్టు రాలడాన్ని నిరోధించే లక్షణాలు ఉన్నాయి. ఉసిరి పొడి జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు తెల్లగా మారడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పల్చబడటాన్ని నియంత్రిస్తుంది. ఆమ్లా, కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తాయి, పొడిబారడం, చుండ్రు నుండి రక్షిస్తాయి. సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. ఈ పేస్ట్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ.. ఇందుకోసం మీరు ఉసిరి పొడిని.. కొద్దిగా వేడి చేసిన కొబ్బరి నూనెలో కలిపి వెంట్రుకలకు అప్లై చేసుకొండి. అరగంట తర్వాత దాన్ని షాంపూ ఉపయోగించి కడిగేయండి. మీరు ఇలా క్రమం తప్పకుండా చేస్తే, మీ జుట్టు బలంగా మారడంతో పాటు నల్లగా మారుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని అనుసరించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్.. దిమ్మదిరిగే ఆస్తులకు ఓనర్

Andrea Jeremiah: న్యూడ్ పోస్టర్‌ కలకలం! హీరోయిన్ వైపే అందరి చూపు…

Varanasi: హమ్మయ్య! తలనొప్పి నుంచి తప్పించుకున్న జక్కన్న

పాత కామిక్ బుక్ ధర అక్షరాల రూ.81 కోట్లు.. ఏ మాత్రం తగ్గనిసూపర్ మ్యాన్ క్రేజ్

ఇండియాలోనే ఖరీదైన నెంబరు ప్లేట్‌.. ధర ఎంతో తెలుసా ??