శ్రీశైలం డ్యామ్‌ కు డేంజర్ బెల్..ఆ గొయ్యిని పూడ్చకకపోతే వీడియో

Updated on: Mar 17, 2025 | 7:52 AM

శ్రీశైలం ప్రాజెక్ట్‌ దగ్గర డేంజర్‌ బెల్‌ మోగుతోందా? డ్యామ్‌కు తక్షణమే రిపేర్‌ చేయకపోతే విధ్వంసం తప్పదా? అంటే నిపుణులు అవుననే హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి అవసరాలనే కాకుండా విద్యుత్‌ను సైతం అందిస్తున్న శ్రీశైలం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదంలో పడింది. డ్యాం గేట్లు ఎత్తినప్పుడు వరద ప్రవాహ తీవ్రతకు ప్లంజ్‌పూల్‌ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ గొయ్యి డ్యామ్​వైపునకు పెరుగుతున్నట్టు కొన్నాళ్ల క్రితం చేసిన స్టడీల్లో తేలింది. ఈ నేపథ్యంలో దాన్ని అలాగే వదిలేస్తే డ్యామ్ మనుగడకే ముప్పు ముంచుకొస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం డ్యామ్‌ కు 2009లో వచ్చిన వరదలతో ప్రాజెక్టు ప్లంజ్​పూల్​లో భారీ గొయ్యి పడింది. రానురాను అది పెరిగి డ్యామ్‌ మరింత డ్యామేజీకి గురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వరదల కారణంగా ఏర్పడిన గుంత ఏటా కోతకు గురవుతూ అత్యంత లోతైన గొయ్యిగా మారి ఆనకట్ట భద్రతకు పెను ముప్పుగా మారింది. ఆ సంవత్సరం శ్రీశైలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు రిజర్వాయర్‌ నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదిలారు. శ్రీశైలం డ్యామ్‌ పునాది 379 అడుగులు ఉండగా ఏటా అది కోతకు గురవుతూ ఫ్లంజ్‌పూల్‌ 413 అడుగుల లోతుకు చేరినట్లు హైడ్రో గ్రాఫిక్‌ సర్వే ద్వారా వెల్లడైంది. ఫ్లంజ్‌పూల్‌ గొయ్యి డ్యామ్‌ పునాదులు దాటి కిందకు పోవడంతో అది మెల్లగా విస్తరిస్తోందని తక్షణమే మరమ్మతు చేపట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తినప్పుడు వరద నీరు కింద పడుతున్న ప్రదేశంలో ఏర్పడిన గొయ్యి క్రమంగా పెరుగుతోంది. నైరుతి రుతుపవనాలు వచ్చే ముందే అంటే.. మేనెలలో గోతిని పూడ్చాలని తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల బృందం సూచించింది.

మరిన్ని వీడియోల కోసం :

గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక…చివరికి.. వీడియో

రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి వీడియో

సెల్‌ఫోన్‌ ఎఫెక్ట్‌.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో

చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?