కోహ్లి తాగిన ఆ డ్రింక్ ఖరీదెంతో తెలిస్తే మైండ్ బ్లాక్
విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించి రికార్డు బద్దలు కొట్టారు. అయితే, ఆట మధ్యలో అతను తాగిన చిన్న డ్రింక్ బాటిల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కోహ్లీ అద్భుతమైన ఫిట్‌నెస్, అంకితభావంతో కూడిన డైట్, కఠినమైన వర్కౌట్ నియమావళికి ప్రతీక. 90% ఆవిరిలో ఉడికించిన ఆహారం, కార్డియో వర్కౌట్స్, బాదం పాలు వంటివి అతని ఫిట్‌నెస్ రహస్యాలు. ఈ కథనం కోహ్లీ అనూహ్య శక్తి వెనుక ఉన్న ఆరోగ్యకరమైన జీవనశైలిని విశ్లేషిస్తుంది.
విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపించుకున్నారు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసిన కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. అయితే కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఆట మధ్యలో విరాట్ ఓ అతి చిన్న బాటిల్‌ను తెరిచి లిక్విడ్‌ను నోట్లో పోసుకోవడం చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ముందెన్నడూ అంత చిన్న బాటిల్‌ను చూడలేదని కొత్త కాంబినేషన్‌తో తయారైన లిక్విడ్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఆ షాట్ దాని ఖరీదు కూడా వేలల్లోనే ఉండొచ్చని కేవలం విదేశాల్లో లభిస్తుందని చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఆట మధ్యలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎనర్జీ డ్రింక్ తాగడం ఆటగాళ్లు చేస్తుంటారు. బాటిల్ అతి చిన్నది కావడంతో ఏమై ఉంటుందన్న సందేహం ఫాన్స్‌లో పెరిగింది. టీమిండియాలో అత్యంత ఫిట్ గా ఉండే ప్లేయర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఓ పరుగుల యంత్రమే కాదు ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడా. 37 ఏళ్ల వయసులోనూ యువ క్రికెటర్లకు సవాల్ విసిరే శరీర ధారుడ్యం, మెరుపు వేగం అతనిది. ఆ ఫిట్‌నెస్ నిలకడగా మెయిన్‌టెయిన్ చేయడం అంత ఈజీ కాదని తెలిసి ఎంతో కష్టపడుతుంటారు కోహ్లి. ఆహారం విషయంలో క్రమశిక్షణతో ఉంటారు విరాట్ కోహ్లి. రోజూ ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ కంటె ముందు కార్డియో వర్కవుట్స్ చేస్తారు. నవంబర్ 5న తన పుట్టిన రోజు సందర్భంగా తన డైట్ సీక్రెట్స్ ను రివీల్ చేసారు. ఫిట్‌నెస్ విషయంలో తను ఎదుర్కొన్న ఛాలెంజ్ ఆహారమనీ ఆరు నెలలుగా రోజుకు మూడు సార్లు ఒకే రకమైన భోజనం తినగలననీ విరాట్ అన్నారు. తన ఆహారంలో దాదాపు 90% ఆవిరి మీద ఉడికించినవి ఉంటాయనీ తను రుచి కోసం ఆరాటపడే వ్యక్తిని కానని చెప్పారు. నిజానికి, కోహ్లీ బాదం పాలు తాగుతారు. బాదం పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగానూ కేలరీలు తక్కువగాను ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐసీసీ అల్టిమేటంపై బంగ్లాదేశ్ రియాక్షన్
గుండె జబ్బులు మౌనంగా మృత్యుఘంట.. అసలు కారణాలేంటి.. ఎలా తగ్గించుకోవచ్చు
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్ అప్డేట్..! వీడియో రిలీజ్ చేసిన అశ్విని వైష్ణవ్
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు.. విషయం తెలిసి పోలీసులు షాక్