రంజీ ప్రాక్టీస్‌లో కోహ్లీ స్టైల్ చూశారా!

Updated on: Feb 02, 2025 | 10:56 AM

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రంజీమ్యాచ్ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. ఈ నెల 30న ఢిల్లీ, రైల్వేస్‌ జట్ల మధ్య ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో.. కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో రైల్వేస్‌తో రంజీ మ్యాచ్‌ కోసం వేగంగా సన్నద్ధమవుతున్నాడు. మంగళవారమే అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నెట్‌ ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టాడు.

బుధవారం కూడా ఉదయాన్నే స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశాడు. కోహ్లీ తీరు చూస్తుంటే చాన్నాళ్ల తర్వాత ఆడబోతున్న రంజీ మ్యాచ్‌ కోసం ఉవ్విళ్లూరుతున్నట్లు కనబడుతోంది. దీంతో ఢిల్లీ టీమ్‌ మేనేజ్‌మెంట్ అతనికి కెప్టెన్సీ ఆఫర్‌ చేసింది. కానీ కోహ్లీ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. యువ కెప్టెన్‌ ఆయుష్‌ బదోనీ కెప్టెన్సీలో ఆడేందుకే మొగ్గు చూపాడు.

మరిన్ని వార్తల కోసం :

బిగ్ వార్నింగ్‌! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!

గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్‌ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది

పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు! 

తిరుమల భక్తులకు అలర్ట్‌.. కొండపై మళ్లీ చిరుత సంచారం..!

దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ సేవలు !