Virat Kohli Vs Gautam Gambhir: మైదానంలో మళ్లీ కోహ్లి వర్సెస్ గంభీర్.. అందరి చూస్తుండగానే గొడవ..!

|

May 02, 2023 | 12:55 PM

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్.. భారత్‌ క్రికెట్‌లో ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు. అయితే వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ముఖ్యంగా గంభీర్‌ తరచూ విరాట్ కోహ్లీని విమర్శిస్తుంటాడు. తాజగా లక్నో వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ, గంభీర్‌ మరోసారి గొడవకు దిగారు.

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్.. భారత్‌ క్రికెట్‌లో ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు. అయితే వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ముఖ్యంగా గంభీర్‌ తరచూ విరాట్ కోహ్లీని విమర్శిస్తుంటాడు. తాజగా లక్నో వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ, గంభీర్‌ మరోసారి గొడవకు దిగారు. మ్యాచ్‌ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీసారు. అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా.. కేఎల్ రాహుల్ గంభీర్‌ను పక్కకు తీసుకెళ్లాడు. వీరి గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 108 పరుగులకే చతికిలపడింది. లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో 18 పరుగులతో పరాజయం పాలైంది. సాధారణంగానే అగ్రెసివ్‌గా కనిపించే విరాట్‌ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో మరింత దూకుడుగా కనిపించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!