Viral Video: క్రికెట్‌లో బౌలర్లపై బ్యాటర్లు, బ్యాటర్లపై బౌలర్లు పత్రాపం చూపిస్తుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని నెట్టింట్లోనూ సందడి చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ఒకటి తెగ వైరలవుతోంది. యూరోపియన్ క్రికెట్ లీగ్ (ECL)లో చోటు చేసుకొన్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ బౌలర్ తనదైన శైలిలో బ్యాట్స్‌మెన్‌పై కోపాన్ని చూపించాడు. ఏకంగా తన షూతో సైగలు చేస్తూ కనిపించాడు. అసలేమైందో ఇప్పుడు చూద్దాం. ఈసీఎల్ లీగ్‌లో భాగంగా టన్‌బ్రిడ్జ్ వేల్స్ వర్సెస్ డ్రూక్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో టన్‌బ్రిడ్జ్ వేల్స్ ప్లేయర్ మార్కస్ ఓరియోర్డన్‌ను తన అద్భుత బంతితో డ్రూక్స్ జట్టు బౌలర్ అహ్మద్‌జాయ్ ఔట్ చేశాడు. ఆ తరువాత ఈ బౌలర్ తన కుడికాలి షూని తీసుకుని, తన చెవి దగ్గర పెట్టుకుని, ఫోన్ కీబోర్డ్‌ను డయల్ చేసినట్లు చేసి, అనంతరం ఫోన్ మాట్లాడుతున్నట్లుగా బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నట్లు చెప్పినట్లు ఈ వీడియోలో చూడొచ్చు.
ఇదే సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న క్రిస్ విలియమ్స్ బౌలర్ చేసిన పనికి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్ టీంకు గట్టిగా బుద్ది చెప్పాలని అనుకుననాడు. అనంతరం డ్రూక్స్ సారథి వహిద్ అబ్దుల్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. ఈ ఓవర్లో క్రిస్ విలియమ్స్ రెండు వరుస బంతుల్లో రెండు సిక్సులు బాదేశాడు. అంతకు ముందు బౌలర్ అహ్మద్‌జాయ్ చేసినట్లుగానే సెలబ్రేషన్స్ చేసుకుని షాక్ ఇచ్చాడు. అయితే షూని కాకుండా అతని బ్యాటును తన చెవి దగ్గర పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నట్లు సైగలు చేశాడు.
మ్యాచ్ విషయానికి వస్తే..
ఈసీఎల్ లీగ్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టన్‌బ్రిడ్జ్ వెల్స్ జట్టు.. నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు సాధించింది. ఇందులో కెప్టెన్ క్రిస్ విలియమ్స్ 56, అలెక్స్ విలియమ్స్ 58 హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం 142 టార్గెట్‌తో బరిలోకి డ్రూక్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కేవలం 7.2 ఓవర్లో 91 పరుగులకు తోకముడిచింది. దీంతో టన్ బ్రిడ్జ్ జట్టు 50 పరుగుల తేడాతో గెలుపొందింది.
Banter you WOULD NOT like to miss ?
C. Williams comes up with a perfect reply to his teammate’s dismissal ?@BET2BALL European Cricket League 2022 | Presented by @KibaInuWorld | @Cricket_Espana pic.twitter.com/Q8H3HMuMO0
— European Cricket (@EuropeanCricket) February 11, 2022
Also Read: Viral Video: అత్యుత్సాహం కొంప ముంచింది.. క్షణాల్లో తుక్కుతుక్కయిన బైక్, షాకింగ్ వీడియో..
Viral Video: చిరుతపులిని ఎదురించిన కుక్క.. దాని అరుపులకు తోకముడిచిన చిరుత.. వీడియో వైరల్