Traditional Game: సంప్రదాయమైన ఆటలు.. ఎప్పుడూ చాలా వినోదాన్ని ఇస్తాయి. కొన్ని ఇటువంటి సంప్రదాయాలు ప్రమాదంతో ముడిపడి ఉన్నా వాటిని ఆడటంలో ఉండే మజా వేరుగా ఉంటుంది. ఆ క్రీడలని చూసేవారికి వచ్చే కిక్కూ వేరే లెవెల్ లో ఉంటుంది కదా! అటువంటిదే ఇది. ఇది సౌదీ అరేబియాలోని పురుషులు, యువకులు ”తాషిర్” యుద్ధ జానపద నృత్యాల సందడి. పశ్చిమ సౌదీ అరేబియా ప్రావిన్స్ తైఫ్‌లో సాంప్రదాయకంగా ప్రదర్శించబడే జానపద నృత్య రూపంలో, యువకులు అదేవిధంగా పురుషులు సాంప్రదాయ దుస్తులను ధరించి, ప్రదర్శన కోసం గన్‌పౌడర్‌తో లోడ్ చేసిన తుపాకులను పట్టుకుంటారు.
నిజానికి ఈ గిరిజన నృత్యం యుద్ధానికి ముందు ప్రత్యర్ధులను ప్రేరేపించడానికి అలాగే బెదిరించడానికి ప్రదర్శిస్తూంటారు. ప్రస్తుతం ఈ నృత్యం వివాహాలు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాలలో తరచుగా ప్రదర్శిస్తున్నారు. ఈ “ఫైర్” నృత్య ప్రదర్శన యొక్క వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. క్లిప్‌కు అకోరిడాంగ్, “తాషీర్” జానపద నృత్యం గన్‌పౌడర్‌తో లోడ్ చేసిన రైఫిల్‌తో ప్రదర్శిస్తారు. తుపాకీ షాట్ ద్వారా భూమి నుండి ముందుకు వెళ్ళబడే భ్రమను సృష్టించడానికి పురుషులు వారి పాదాలపైకి కాల్పులు జరుపుతారు.
ఈ వీడియో చూడండి..
The Taasheer folk dance is performed in the western Saudi Arabian province of Taif. Dancers load their guns with gunpowder without bullets, before taking centre stage to showcase their dancing skills. pic.twitter.com/upAitDTiaO
— SCMP News (@SCMPNews) April 22, 2021
తైఫ్ ప్రజల వారసత్వం, వారసత్వాన్ని కాపాడటానికి ఒక మార్గం, చిన్నపిల్లలకు ప్రదర్శన ఇవ్వడానికి శిక్షణ ఇవ్వడం. చిన్నపిల్లలకు కూడా ఒకే రకమైన ఆయుధంతో బోధిస్తారు అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో ఈ నృత్యం గురించి వివరిస్తూ పేర్కొంది.
Also Read: Double Mask: డబుల్ మాస్కింగ్ అంటే ఏమిటి? ఎందుకు అలా చేయాలి? కరోనాను ఎదుర్కోవడంలో దాని ప్రభావం ఎంత?