సింగిల్ మదర్ కావడం అంత ఈజీ కాదు.. సానియా మీర్జా వీడియో
హైదరాబాద్ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత తొలిసారి జీవితంలోని కష్టాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఒంటరి తల్లిగా తన కుమారుడిని పెంచడం 'చాలా చాలా కష్టం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ హోస్ట్ చేసిన 'సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా' అనే పాడ్‌కాస్ట్‌లో వీరిద్దరూ స్నేహం, మాతృత్వం, ఒంటరిగా పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు.
ఫరా ఖాన్, సానియాను ప్రశంసిస్తూ, “ఒంటరి తల్లిగా ఉండటం కంటే కష్టమైంది ఏమీ లేదు. నువ్వు నీ కెరీర్‌లో ఉన్నత శిఖరాలను, వ్యక్తిగతంగా అట్టడుగు స్థితిని చూశావు. రెండింటినీ సమానంగా ఎదుర్కొన్నావు” అన్నారు. దీనికి సానియా స్పందిస్తూ, “ఇది చాలా చాలా కష్టం. మనందరికీ మన ప్రయాణం ఉంటుంది, సరైంది ఎంచుకోవాలి” అని తన కష్టాన్ని అంగీకరించింది. తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్ర ఒత్తిడి గురించి సానియా గుర్తుచేసుకుంది. ఒకసారి తనకు పానిక్ అటాక్ వచ్చినప్పుడు, ఫరా ఖాన్ సెట్‌కు వచ్చి అండగా నిలిచారని తెలిపింది. “ఆ రోజు మీరు రాకపోతే నేను ఆ లైవ్ షో చేసేదాన్ని కాదు. నేను వణికిపోతున్నాను” అని సానియా చెప్పగా, “నువ్వు పానిక్ అటాక్‌తో ఉండటం చూసి నేను భయపడ్డాను. పైజమాలోనే పరిగెత్తుకుంటూ వచ్చేశాను” అని ఫరా ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :