Rohit Sharma: రోహిత్‌ శర్మకు ఊహించని షాక్

Updated on: Oct 06, 2025 | 8:37 PM

టీమిండియా సీనియర్‌ ప్లేయర్, కెప్టెన్‌గా 2024లో టీ20 వరల్డ్‌ కప్‌, 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించిన రోహిత్‌ శర్మకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని స్థానంలో యంగ్‌ ప్లేయర్‌, భారత టెస్టు జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు వన్డే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.

కాగా టీ20 వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత టీ20 ఫార్మాట్‌కు, ఆ తర్వాత టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్‌.. వన్డే వరల్డ్ కప్‌ 2027 వరకు ఈ ఫార్మాట్‌ ఆడాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మరి అప్పటి వరకు రోహితే కెప్టెన్‌గా ఉంటాడని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా రోహిత్‌ను తప్పించి, అతని ప్లేస్‌లో శుబ్‌మన్‌ గిల్‌ను బీసీసీఐ కెప్టెన్‌గా నియమించింది. దీంతో టెస్టు, వన్డే రెండు ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్‌ అయ్యాడు గిల్‌. టీ20 జట్టుకు మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా గిల్‌ కెప్టెన్‌గా ఆస్ట్రేలియాతో వారి దేశంలో ఈ నెల 19 నుంచి మూడు వన్డేలు ఆడనుంది. అలాగే 5 టీ20ల సిరీస్‌ కూడా ఆడుతుంది. ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టులో శుభ్‌మన్ గిల్ , రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌, విరాట్ కోహ్లి ఉన్నారు. భారత టీ20 జట్టులో సూర్యకుమార్ యాదవ్ , అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ , తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ , వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్ సుందర్‌ ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

New Traffic Rules: వాహనదారులకు ఇక దబిడి దిబిడే.. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ ఇవే!

స్పేస్‌ డెలివరీ వెహికిల్‌ రెడీ.. గంటలో ప్రపంచంలో ఏ మూలకైనా సరుకు రవాణా

ఊగిపోయిన భవనాలు.. జనం పరుగో పరుగు

చియాసీడ్స్‌ ఇలా తిన్నారో.. అంతే సంగతులు !!

బంగాళాదుంప తొక్కలు పడేయకండి.. లాభాలు తెలిస్తే వదలరు!