Rishabh Pant: 16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..

|

May 06, 2024 | 10:26 AM

కారు ప్రమాదం నుంచి కోలుకున్న భారత స్టార్‌ ఆటగాడు రిషభ్‌ పంత్‌ 15 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెస్‌ సాధించడానికి, బరువును తగ్గించుకోవడానికి దాదాపు నాలుగు నెలల పాటు నోరు కట్టుకున్నాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో అదరగొడుతున్న అతడు టీ20 ప్రపంచ కప్‌ జట్టులోకి అడుగు పెట్టాడు. ఆహార నియమాలపై రిషభ్‌ పంత్ కఠినంగా ఉన్నట్లు అతడి డైట్‌లో భాగస్వామ్యులైన వర్గాలు తెలిపాయి.

కారు ప్రమాదం నుంచి కోలుకున్న భారత స్టార్‌ ఆటగాడు రిషభ్‌ పంత్‌ 15 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెస్‌ సాధించడానికి, బరువును తగ్గించుకోవడానికి దాదాపు నాలుగు నెలల పాటు నోరు కట్టుకున్నాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో అదరగొడుతున్న అతడు టీ20 ప్రపంచ కప్‌ జట్టులోకి అడుగు పెట్టాడు. ఆహార నియమాలపై రిషభ్‌ పంత్ కఠినంగా ఉన్నట్లు అతడి డైట్‌లో భాగస్వామ్యులైన వర్గాలు తెలిపాయి. ఫ్రైడ్ చికెన్, రసమలై, బిర్యానీకి దూరంగా ఉన్నాడట. చిల్లీ చికెన్‌ను కేవలం 5 ఎంఎల్‌ ఆలివ్‌ ఆయిల్‌తో తయారు చేసుకుని తిన్నాడట. ప్రమాదానికి ముందు కాస్త బొద్దుగా ఉండే పంత్‌ను ఇప్పుడు చూస్తే.. తేడా కనిపిస్తుందని మాజీ క్రికెటర్లూ ప్రశంసలు కురిపించారు.

కేలరీలను తగ్గించుకునేందుకు పంత్ చాలా కష్టపడ్డాడన్నారు. అతడి శరీరం 1400 కేలరీలను కోరుకుంటే.. వెయ్యి మాత్రమే ఇచ్చేవాడన్నారు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి అవసరమైన కసరత్తులు ప్రారంభించిన తర్వాత డైట్‌ ను మరింత కఠినతరం చేశాడని క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. కుడి కాలి గాయం నుంచి కోలుకుని బలంగా మారేందుకు శ్రమించాడు. పంత్‌ తన ఆహారం విభిన్నంగా ఉండాలని కోరుకుంటాడనీ… అందుకోసమే, ఎన్సీఏ పర్యవేక్షణలో ఉంటూనే బెంగళూరులో ఓ రెంట్‌ హౌస్‌కు మారిపోయాడనీ… హోటల్‌ ఫుడ్‌ కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారానికే ప్రాధాన్యం ఇచ్చాడనీ తెలిపారు. కేవలం ఫైవ్ ఎంఎల్ ఆలివ్‌ ఆయిల్‌తోనే తన వంటను చేయించుకొనేవాడు. అన్ని రకాల ఫుడ్‌ను వదిలేసినప్పటికీ చిల్లీ చికెన్‌ను మాత్రం తినేందుకు మొగ్గు చూపాడనీ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.