Rishab Pant: ఏడు నెలలు నరకం అనుభవించా.. రిషభ్ పంత్ ఎమోషనల్.
చాలా రోజుల గ్యాప్ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఐపీఎల్‌లో అదరగొట్టేశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్.. తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు. అన్ని నెలల పాటు అనుభవించిన నరక వేదన గురించి బయటపెట్టాడు.
చాలా రోజుల గ్యాప్ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఐపీఎల్‌లో అదరగొట్టేశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్.. తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు. అన్ని నెలల పాటు అనుభవించిన నరక వేదన గురించి బయటపెట్టాడు. రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని చాలా మార్చిందనీ ఆ సమయం ఎంతో అనుభవం నేర్పిందని పంత్ అన్నాడు. తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించిందనీ ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించడం నరకంగా అనిపించిందనీ చెప్పాడు. దాదాపు రెండు నెలలు బ్రష్ చేసుకోలేకపోయినట్లు తెలిపాడు. వీల్‌ఛైర్‌లో ఉండే వ్యక్తులను చూస్తే ఇబ్బందిగా అనిపించేదనీ భయంగా ఉండేదనీ అన్నాడు. , భగవంతుడు రక్షించాడనీ రిషభ్ పంత్ గుర్తు చేసుకున్నాడు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న పంత్.. ఈ విషయాలను పంచుకున్నాడు. 2022 డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత 15 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెట్‌పై దృష్టి పెట్టి పుంజుకున్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టి మరోసారి అభిమానుల ఆదరణ గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టులో ఛాన్స్ సంపాదించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

