ఆటగాళ్లపై రవీంద్ర జడేజా భార్యసెన్సేషనల్ కామెంట్స్
గుజరాత్ మంత్రి రివాబా జడేజా, తన భర్త రవీంద్ర జడేజాను పొగుడుతూనే ఇతర భారత క్రికెటర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు ఆటగాళ్లు వ్యసనపరులని, తన భర్త మాత్రం మంచివాడని ఆమె బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు అనడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ విద్యా శాఖ మంత్రి, రవీంద్ర జడేజా సతీమణి రివాబా భారత జట్టు ఆటగాళ్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్తను పొగుడుతూనే ఇతర భారత ఆటగాళ్లు తప్పుడు పనులు చేస్తారని ఆరోపించారు. తన భర్తను పొగుడుతూనే ఇతర భారత ఆటగాళ్లు తప్పుడు పనులు చేస్తారని ఆరోపించారు. కొందరు క్రికెటర్లు వ్యసనపరులని, కానీ తన భర్త మాత్రం చాలా మంచివాడని ద్వారకలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒక బహిరంగ రాజకీయ సభలో రివాబా జడేజా తన భర్త గొప్పతనాన్ని వివరించింది. నా భర్త రవీంద్ర జడేజా క్రికెట్ ఆడటానికి లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు వెళ్తుంటారు. అక్కడ ఎన్ని ప్రలోభాలు ఉన్నా, అతను ఎప్పుడూ ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాలేదు. అతను తన బాధ్యతలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి చాలా పద్ధతిగా ఉంటాడని చెప్పుకొచ్చింది. అయితే, ఇక్కడితో ఆగకుండా ఆమె ఇతర ఆటగాళ్ల గురించి ప్రస్తావించడం వివాదానికి కారణమైంది. ఇతర ఆటగాళ్లు ఎవరనేది ఆమె స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, అందరినీ ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రివాబా వ్యాఖ్యలపై నెటిజన్లు, ముఖ్యంగా ఇతర క్రికెటర్ల అభిమానులు మండిపడుతున్నారు. మీ భర్త మంచితనాన్ని చాటుకోవడానికి, మొత్తం జట్టును కించపరచడం సరికాదు” అని విమర్శిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్… కాశీ తర్వాత ఇక్కడే…
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??