Sandeep Lamichhane: అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్‌ను పఠాన్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఎనిమిదేళ్ల జైలు శిక్ష తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. బుధవారం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. 2022లో కాట్మండూలోని ఓ హోటల్ లో సందీప్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ 17 ఏళ్ల ఓ మైనర్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన నేపాల్ జిల్లా కోర్టు 2024 జనవరిలో అతడ్ని దోషిగా తేల్చింది.
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్‌ను పఠాన్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఎనిమిదేళ్ల జైలు శిక్ష తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. బుధవారం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. 2022లో కాట్మండూలోని ఓ హోటల్ లో సందీప్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ 17 ఏళ్ల ఓ మైనర్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన నేపాల్ జిల్లా కోర్టు 2024 జనవరిలో అతడ్ని దోషిగా తేల్చింది. అతనికి ఎనిమిదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సందీప్ లామిచ్చెన్ హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ సూర్య దర్శన్, దేవ్ భట్టా డివిజన్ బెంచ్, గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో అతడ్ని నిర్దోషిగా తేల్చింది.
2022 ఆగస్టు 21న కాట్మండూ, భక్తపూర్లో తనను పలు ప్రాంతాల్లో తిప్పి అదే రోజు రాత్రి కాట్మండూ సినమంగల్ లోని ఓ హోటల్ కు తీసుకొచ్చి అత్యాచారం చేసినట్లు నేపాల్ కు చెందిన ఓ 17 ఏళ్ల మైనర్ ఆరోపించింది. అతడిపై అక్కడి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అటు నేపాల్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో నేపాల్ క్రికెట్ బోర్డు సందీప్ లామిచ్చెన్ పై వేటు వేసింది. ఇక గతేడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన అతడ్ని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. ఈ క్రమంలో 2022 నవంబర్ లో అతడిని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లి, సందీప్ లామిచ్చెన్ బెయిల్ తెచ్చుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.