Virat Kohli: అభిమానులకు అందుకే విరాట్‌ కోహ్లి దేవుడయ్యాడు..! సోషల్‌మీడియాను ఊపేస్తున్న కోహ్లీ వీడియో.

|

Mar 01, 2023 | 7:27 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిని విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ముద్దుగా కింగ్‌ అని పిలుచుకుంటారు. భారత క్రికెట్‌ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి కోహ్లి పేరులో కింగ్‌ అనే బిరుదును కలిపేశారు. కోహ్లికి కింగ్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిని విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ముద్దుగా కింగ్‌ అని పిలుచుకుంటారు. భారత క్రికెట్‌ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి కోహ్లి పేరులో కింగ్‌ అనే బిరుదును కలిపేశారు. కోహ్లికి కింగ్‌ అనే బిరుదు రావడానికి అతని గ్రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌ ఎంత కారణమో, అతని బిహేవియర్‌ కూడా అంతే.. ఫీల్డ్‌లో దూకుడుగా ఉండే కింగ్‌ కోహ్లి.. సందర్భానుసారంగా రియాక్ట్‌ అవుతూ చాలా హుందాగా కూడా కనిపిస్తాడు. ప్రత్యర్ధులు కవ్విస్తే ఉగ్రరూపం దాల్చే కోహ్లి.. అదే వారు కలిసిపోతే సరదాగా డ్యాన్స్‌లు వేస్తూ మైదానంలో ఉన్న ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను హుషారెక్కిస్తాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా జరిగిన ఓ అనుహ్య ఘటనతో మరోసారి టాక్‌ ఆఫ్‌ ద సోషల్‌మీడియాగా నిలిచాడు. ఢిల్లీ టెస్ట్‌ మూడో రోజు ఆటలో విరాట్‌ కోహ్లి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన కోహ్లి వారిని వారించి, ఆర్సీబీ అని కాకుండా తన జెర్సీపై ఉన్న బీసీసీఐ ఎంబ్లెంని చూపిస్తూ ఇండియా అని ఫ్యాన్స్‌కు సైగ చేశాడు. కోహ్లి ఇలా చెప్పాడో లేదో.. ఇండియా.. ఇండియా.. అంటూ కేకలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కోహ్లి దేశానికి ఇచ్చే ప్రాధాన్యతను కొనియాడుతూ అభిమానులు కామెంట్స్‌తో సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Mar 01, 2023 07:27 PM