ముగ్గురు ఆల్‌రౌండర్లపై కన్నేసిన ముంబై వీడియో

Updated on: Nov 16, 2025 | 4:40 PM

డబ్ల్యూపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్, 2026 మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. అమేలియా కెర్‌ను విడుదల చేసినప్పటికీ, ఆమెను తిరిగి కొనుగోలు చేయాలని జట్టు భావిస్తోంది. సమతూకం కోసం నాదిన్ డి క్లర్క్, డియాండ్రా డాటిన్‌లను కూడా లక్ష్యంగా చేసుకుంది.

విమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో రెండు సార్లు టైటిల్ గెలుచుకుంది. అయితే డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలానికి ముందు కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉండటంతో, ముంబై జట్టులో కొన్ని కీలక మార్పులు తప్పవనిపిస్తోంది. నాట్ స్కివర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, అన్‌క్యాప్డ్ జీ. కమలినీలను అట్టిపెట్టుకున్న ముంబై, అమేలియా కెర్ వంటి కీలకమైన ఆల్‌రౌండర్‌ను విడుదల చేయవలసి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో