MS DHONI: మహీభాయ్ షాకింగ్ నిర్ణయం !! 2022ఐపీఎల్ సీజన్ నుంచి ??
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఎమ్మెస్ ధోనీ తప్పుకోవడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజా మోయబోతున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, ప్లేయర్‌గా, వికెట్ కీపర్‌గా ధోనీ ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కే తరుపున కొనసాగుతాడని ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 12 సీజన్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్… 11 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది. అత్యధికంగా 9 సార్లు ఫైనల్ ఆడి, నాలుగు సార్లు టైటిల్ గెలిచింది.
Also Watch:
Know This: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయట.. అది ఎలాగో తెలుసా ??
వైరల్ వీడియోలు
Latest Videos