MS Dhoni: మిస్టర్‌ కూల్‌ గ్యారేజ్‌లోకి కొత్తకారు.. ఆ కారులో షికార్లు కొట్టిన ఇండియన్ క్రికెటర్స్.స్వయంగా డ్రైవ్‌ చేసిన ధోనీ..

Updated on: Nov 23, 2022 | 9:41 AM

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనికి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే రాంచీలోని తన నివాసంలో ఉన్న గ్యారేజీలో హమ్మర్, ఫోర్డ్ మస్టాంగ్‌ వంటి ఖరీదైన కార్లతో పాటు లెక్కలేనన్ని బైకులు ఉన్నాయి.


టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనికి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే రాంచీలోని తన నివాసంలో ఉన్న గ్యారేజీలో హమ్మర్, ఫోర్డ్ మస్టాంగ్‌ వంటి ఖరీదైన కార్లతో పాటు లెక్కలేనన్ని బైకులు ఉన్నాయి. తాజాగా ధోని గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. కియాకు చెందిన ‘EV6′ కారుని కొనుగోలు చేసారు ధోనీ. కాగా ధోని గ్యారేజిలో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కొనడమే ఆలస్యం తన కొత్త కారులో షికారుకు బయలుదేరారు. తన సహచరులు రుతురాజ్‌ గైక్వాడ్‌, కేదార్‌ జాదవ్‌లను వెంటపెట్టుకుని మరీ కొత్త కారులో ఎంచెక్కా చక్కర్లు కొట్టాడు. ఈ ఎలక్ట్రిక్‌ కారును ధోనినే స్వయంగా డ్రైవ్‌ చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.కాగా రాంచీలో ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఇక ఇదే జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్న కేదార్‌ కూడా రాంచీలోనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇద్దరినీ సరదాగా తన కారులో షికారుకు తీసుకెళ్లాడు ధోని. ఇక కారు విషయానికొస్తే.. కొరియన్ కంపెనీ కియాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 708 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే ప్రస్తుతం భారతదేశంలో EV6 ఎక్స్-షోరూమ్ ధర 65 లక్షలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 23, 2022 09:41 AM