ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) కోసం ప్రస్తుతం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం అన్ని జట్ల ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఆటగాళ్లు ముంబైలోని జట్టు క్యాంపులో చేరారు. ఆరెంజ్ ఆర్మీ ఆదివారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకుంది. అందులో దాని స్టార్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్(T Natarajan) అద్భుతమైన బంతితో స్టంప్‌ను విరగ్గొట్టడం చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని హైదరాబాద్ మార్చి 29న పుణెలో రాజస్థాన్ రాయల్స్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ‘ఆరెంజ్ ఆర్మీ’ తన సన్నాహాల్లో ఎలాంటి అవకాశాన్ని వదలడం లేదు. గత సీజన్‌లో హైదరాబాద్ ప్రదర్శన నిరాశపరిచినా, ఈసారి మళ్లీ పుంజుకుని మైదానంలోకి దిగనుంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన క్రికెట్ లీగ్‌కు ఆటగాళ్లు ఎలా సిద్ధమవుతున్నారనే దానిపై ఒక వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకుంది. ఈ వీడియోలో, లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ ప్రాక్టీస్ సెషన్‌లో స్టంప్‌ను విరగ్గొట్టడం కనిపించింది. 30 ఏళ్ల తమిళనాడు ఆటగాడు నటరాజన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని అద్భుతమైన ప్రదర్శనల కారణంగా 2020-21 ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ ఇండియాలో ఎంపికయ్యాడు. అక్కడ మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు.
అనంతరం నటరాజన్ 2021లో మోకాలి గాయంతో బాధపడ్డాడు. దాని కోసం అతను శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఆ గాయం కారణంగా, అతను ఎన్నో IPL 2021 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 34.50 సగటుతో రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే, ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌గా తిరిగి ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు. మెగా వేలానికి ముందే విడుదలైన అతడిని హైదరాబాద్ రూ.4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. 2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ పేసర్, ఇప్పటివరకు 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 34.40 సగటు, 8.23 ఎకానమీ రేటుతో 20 వికెట్లు పడగొట్టాడు.
When he isn’t crushing your toes, he’s breaking the stumps down! ?@Natarajan_91 #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/6bpkrG3ilZ
— SunRisers Hyderabad (@SunRisers) March 20, 2022
Women’s World Cup 2022: భారత్‌కు కలిసొచ్చిన పాకిస్తాన్ విజయం.. సెమీస్ రేసుకు మరింత చేరువగా..