చూపు లేదని చిన్న చూపా ?? కప్ గెలిచి వస్తే.. లక్షేనా ?? అంధ మహిళా క్రికెటర్ల ప్రైజ్‌ మనీపై విమర్శలు

Updated on: Nov 25, 2025 | 9:36 PM

భారత అంధ మహిళల జట్టు తొలి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. నేపాల్‌ను ఓడించి, టోర్నీలో అజేయంగా నిలిచింది. ఈ అపూర్వ విజయం దేశానికి గర్వకారణం. అయితే, క్రీడాకారిణులకు లభించిన తక్కువ ప్రైజ్ మనీపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ చారిత్రక విజయానికి మరింత ప్రోత్సాహం, మెరుగైన బహుమతులు అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

భారత క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం నమోదైంది. తొలిసారిగా నిర్వహించిన అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుని భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన నేపాల్ జట్టుతో తలపడిన భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి, యావత్ భారత జాతి గర్వపడేలా చేసింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ జట్లు కూడా పోటీపడ్డాయి. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులే చేసింది. భారత జట్టు పకడ్బందీగా బౌలింగ్, ఫీల్డింగ్‌ చేయడంతో నేపాల్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క బౌండరీ మాత్రమే నమోదైంది. అనంతరం 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని నమోదు చేసింది. మొదటి అంధ మహిళల ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిస్తే కోట్లాది రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది. కానీ, చారిత్రక విజయాన్ని అందుకున్న భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు మాత్రం చాలా చిన్న ప్రైజ్ మనీ దక్కింది. ఈ చారిత్రక విజయం తర్వాత టీమిండియాలోని ప్రతి క్రీడాకారిణికి లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి లభించనుంది. ఈ ప్రైజ్ మనీని చింటల్స్ గ్రూప్ అనే సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఇంత గొప్ప గౌరవం తెచ్చిన అంధ క్రీడాకారిణులకు మరింత మెరుగైన ప్రైజ్ మనీ, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్‌ నరసింహ

Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్‌

TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!

6,6,6,6,6,6… సిక్సర్ల సునామీ.. 12 బంతుల్లో 50 రన్స్

పంట కాలువలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్‌ ఏమయ్యాడంటే