వన్డే సిరీస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత్ జట్టును ప్రకటించారు. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ జట్టులోకి తిరిగి వచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వగా, అక్షర్ పటేల్‌కు చోటు దక్కలేదు.
భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే క్రికెట్ సిరీస్‌కు సంబంధించి భారత్ జట్టుని ప్రకటించింది. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తొలుత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను తాత్కాలిక వన్డే కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చాయి. పంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మెన్ ఇన్ బ్లూకు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించినా ..అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపింది. కేఎల్ రాహుల్ సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ వన్డే ఫార్మాట్‌లో జట్టు పగ్గాలు చేపట్టనున్నారు. ఈ సిరీస్‌కు మాజీ కెప్టెన్ లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్‌లో నలుగురు ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌లోకి తిరిగి వస్తున్నారు. వారిలో ముఖ్యమైన పేరు రవీంద్ర జడేజా. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జడేజాను ఎంపిక చేయకపోవడంతో అతని కెరీర్‌పై సందేహాలు తలెత్తాయి. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆ ఊహాగానాలను ఖండిస్తూ రవీంద్ర జడేజా తమ ప్రణాళికలో భాగమని అప్పుడే స్పష్టం చేశారు. కాగా, “సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో మాత్రమే కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమయానికి గిల్ అందుబాటులో వచ్చే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
జడేజా లాగానే, మరో కీలక ఆటగాడు రిషబ్ పంత్ కూడా జట్టులోకి వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత పంత్ ఈ ఫార్మాట్‌లో తిరిగి వచ్చినా, ట్రోఫీలో ఆయనకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. వికెట్ కీపింగ్ బాధ్యతలను రాహులే చూసుకున్నారు. కాబట్టి ఈ సిరీస్‌లో పంత్‌కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. 2023 తర్వాత మొదటిసారిగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డే జట్టులో చోటు దక్కింది. అలాగే యువ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ కూడా ఈ సిరీస్‌లో అవకాశాన్ని అందుకున్నారు. మరోవైపు, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డే ఫార్మాట్ నుంచి విశ్రాంతి కొనసాగుతోంది. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ఈ సిరీస్‌కు బ్రేక్ ఇచ్చారు. రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడంతో, మరో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా ఓవరాక్షన్.. భారత మహిళపై వేధింపులు
PM Modi: ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్న ప్రధాని మోదీ
బద్దలైన అగ్నిపర్వతం.. భారత్‌పై ప్రభావం.. పలు విమానాలు రద్దు
