Hyderabad: రాజీవ్ గాంధీ స్టేడియంలో పాక్ ప్లేయర్స్ ప్రాక్టిస్.. వీడియో చూడండి..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్(IST) ప్రారంభమవుతుంది. సెక్యూరిటీ కారణాల వల్ల పాకిస్థాన్ - న్యూజిలాండ్ మధ్య జరిగే వార్మప్ మ్యాచ్‌కి క్రికెట్ అభిమానులకు అనుమతి లేదు. అభిమానులు లేకుండానే ఇరు జట్లు తలపడనున్నాయి. కాగా నేడు పాక్ జట్టులోని సభ్యులందరూ ముమ్ముర సాధన చేశారు. ఆ వీడియోను చూడండి.
పాకిస్తాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ఏడేళ్ల తర్వాత దాదాది టీమ్ తొలిసారి వచ్చింది. అదికూడా హైదరాబాద్‌కు చేరుకోవడం విశేషం. బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్తాన్ జట్టును పార్క్ హయత్ వరకు పటిష్ట భద్రత నడుమ తీసుకొచ్చారు. మరోవైపు మంగళవారం నైట్ న్యూజిలాండ్ టీమ్‌లోని కొందరు ప్లేయర్స్ రాగా.. బుధవారం రాత్రి మిగతా ప్లేయర్స్ హైదరాబాద్ వచ్చేశారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో న్యూజిలాండ్ జట్టు బస చేసింది. వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్(IST) ప్రారంభమవుతుంది. సెక్యూరిటీ కారణాల వల్ల పాకిస్థాన్ – న్యూజిలాండ్ మధ్య జరిగే వార్మప్ మ్యాచ్‌కి క్రికెట్ అభిమానులకు అనుమతి లేదు. ఫ్యాన్స్ లేకుండానే ఇరు జట్లు తలపడనున్నాయి. కాగా నేడు పాక్ జట్టులోని సభ్యులందరూ ముమ్ముర సాధన చేశారు. ఆ వీడియోను చూడండి.
న్యూజిలాండ్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?
న్యూజిలాండ్ vs పాకిస్థాన్ వార్మప్ గేమ్ స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి హిందీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ , ఫఖర్ జమాన్ , ఇమామ్ ఉల్ హక్ , అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ ఆఫ్రిది, మహ్మద్ వసీం.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్ , మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్, ఇషి సోధి, విల్ సౌత్ , టిమ్ సౌత్ యంగ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..