Learning cricket: ఇండియన్స్ నుంచి క్రికెట్ నేర్చుకుంటున్న జర్మన్ అధికారులు..! వైరల్ అవుతున్న వీడియో..
క్రికెట్ అంటే ఇష్టపడని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ క్రీడాభిమానులున్నారు. దేశాలకు అతీతంగా ఈ క్రీడాకారులను అభిమానిస్తుంటారు. తాజాగా కొందరు భారతీయులు జర్మన్ అధికారులకు క్రికెట్ నేర్పిస్తున్న వీడియో..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో బెంగళూర్ కేంద్రంగా పనిచేసే జర్మన్ కాన్సులేట్‌లో అధికారులు సరదాగా క్రికెట్ ఆడుతున్నారు. లంచ్ విరామ సమయంలో వారు తమ ఇండియన్ కొలీగ్స్‌తో కలిసి క్రికెట్ ఆడుతున్నారు. వారు తమ భారత కొలీగ్స్ నుంచి క్రికెట్ ఎలా ఆడాలో మెళకువలు నేర్చుకుంటున్నారు. జర్మన్ అధికారి బ్యాటింగ్ చేస్తుండగా ఇద్దరు ఇండియన్ కొలీగ్స్ బౌలింగ్ చేస్తున్నారు. ఈ వీడియోను అచిం బుకర్ట్ కాన్సులేట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. లంచ్ బ్రేక్‌లో మా ఇండియన్ కొలీగ్స్ జర్మన్ సహచరులకు క్రికెట్ ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేయిస్తున్నారని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. వేలాదిమంది నెటిజన్లు వీడియోను వీక్షిస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేశారు. దేశాలను కలిపే గొప్ప ఆట క్రికెట్ అని ఓ యూజర్ అభిప్రాయపడితే, ఇక భారత్-జర్మనీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తే టూరిజంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని, తద్వారా మరింతమంది కొహ్లీలు బయటకు వస్తారని మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.