F3 Car Launch: భాగ్యనగరంలో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్.. లైవ్ వీడియో

|

Aug 22, 2021 | 5:31 PM

భాగ్యనగరంలో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్ మని దూసుకెళ్ళాయి. హైదరాబాద్ అడ్డాగా స్పోర్ట్స్ కార్ రేసింగ్ కనువిందు చేసింది. రాఖీ పండు పర్వదినాన .. స్ట్రీట్ సర్క్యూట్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో..

భాగ్యనగరంలో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్ మని దూసుకెళ్ళాయి. హైదరాబాద్ అడ్డాగా స్పోర్ట్స్ కార్ రేసింగ్ కనువిందు చేసింది. రాఖీ పండు పర్వదినాన .. స్ట్రీట్ సర్క్యూట్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో.. గచ్చిబౌలిలోని ఐటీసీ కోహినూర్ పరస ప్రాంతాల్లో ఈ రేసింగ్‌ను నిర్వహించారు. గతంలోనూ పలుమార్లు హైదరాబాద్‌లో స్పోర్ట్స్ కార్ రేసింగ్ నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే ఫార్ములా 4 రేసులను హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరులోనూ నిర్వహించనున్నట్టు రేసింగ్‌ ప్రమోషన్స్‌ RPPL నిర్వాహకులు తెలిపారు. ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్‌ FIA మద్దతుతో ఎఫ్‌-4 ఇండియన్‌ చాంపియన్‌షిప్‌, ఫార్ములా రీజినల్‌ ఇండియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ఈ నాలుగు నగరాలలో నిర్వహించనున్నారు. ఎఫ్‌-3 కార్లతో నిర్వహించబోయే ఈ పోటీలు భారత్‌లో ఇదే తొలిసారి. వీటి నిర్వహణ కోసం హైదరాబాద్‌లో ఇప్పటికే వంద కోట్ల రూపాయలను కార్లు, మౌలిక వసతులపై నిర్వాహకులు వెచ్చించారు. 2022లో ప్రారంభం అయ్యే ఈ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఒక నెల పాటు కొనసాగుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Allu Arha: అల్లు అర్హ, అయాన్ల రక్షా బంధన్ వేడుకల లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ..

Krithi Shetty: ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ..

Published on: Aug 22, 2021 05:17 PM