Faf du Plessis: ఆసుపత్రిలో  సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌ చేరిన డుప్లెసిస్...  ఫీల్డింగ్‌లో తలకు గాయం.. ( వీడియో )
Faf Du Plessis

Faf du Plessis: ఆసుపత్రిలో సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌ చేరిన డుప్లెసిస్… ఫీల్డింగ్‌లో తలకు గాయం.. ( వీడియో )

|

Jun 14, 2021 | 8:49 AM

క్రికెట్ మైదానంలో మ‌రో క్రికెట్ ప్లేయ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ మ‌రో ప్లేయ‌ర్‌ను ఢీకొట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ ఫఫ్ డుప్లెస్సిస్‌ ని వెంట‌నే ఆసుపత్రికి తరలించారు.

క్రికెట్ మైదానంలో మ‌రో క్రికెట్ ప్లేయ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ మ‌రో ప్లేయ‌ర్‌ను ఢీకొట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ ఫఫ్ డుప్లెస్సిస్‌ ని వెంట‌నే ఆసుపత్రికి తరలించారు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో భాగంగా క్వెట్టా గ్లాడియేట‌ర్స్ టీమ్ త‌ర‌ఫున ఆడుతున్న డుప్లెస్సి.. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. శనివారం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. పెషావ‌ర్ జాల్మీ ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ కొట్టిన షాట్‌తో బంతి.. లాంగాన్ బౌండ‌రీ వైపు దూసుకెళ్ల‌గా డుప్లెస్సి డైవ్ చేశాడు. సరిగ్గా అదే స‌మ‌యంలో లాంగాఫ్ నుంచి మ‌రో ప్లేయ‌ర్ మ‌హ్మ‌ద్ హ‌స్నైన్ దూసుకొచ్చాడు. ఈ క్ర‌మంలో అత‌ని మోకాలు డుప్లెస్సి త‌ల‌కు బలవంతంగా త‌గిలింది. దీంతో ఫఫ్ డుప్లెస్సిస్ కుప్ప‌కూలాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: China: చైనా లో పేలిన గ్యాస్ పైప్ లైన్ 12 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు.. ( వీడియో )

హైదరాబాద్‌ ఖరీదైన కుక్క కిడ్నాప్‌.. ఆచూకీ అందించిన వారికి రివార్డు.. (వీడియో )