హైదరాబాద్ ఖరీదైన కుక్క కిడ్నాప్.. ఆచూకీ అందించిన వారికి రివార్డు… (వీడియో )
ప్రత్యేక జాతికి చెందిన ఓ శునకం చోరీకి గురైన ఘటన హైదరాబాద్‌లో తాజాగా చోటు చేసుకుంది. జాతి కుక్క కిడ్నాప్ స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
ప్రత్యేక జాతికి చెందిన ఓ శునకం చోరీకి గురైన ఘటన హైదరాబాద్‌లో తాజాగా చోటు చేసుకుంది. జాతి కుక్క కిడ్నాప్ స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. పారడైస్ సింధి కాలనీ రోడ్ పై ఉన్న జాతి కుక్కను బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. మే నెల 17 న బ్లూ కలర్ R15 బైక్‌పై వచ్చిన వ్యక్తి కుక్కను ఎత్తుకెళ్లినట్లు రాంగోపాల్ పెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది సాక్షి కనుగో అనే యువతి. వివిధ జాతి కుక్కలను పెంచుతూ అమ్మకాలు జరుపుతుంది సాక్షి. కిడ్నాప్‌కు గురైన కుక్క ‘షిహ్ త్జు’ జాతి కి చెందిన రియో అని పోలీసులకు ఇచ్చిన కంప్లైట్‌లో తెలిపింది. మార్కెట్‌లో రియో విలువ సుమారు 45 వేలు డిమాండ్ ఉంటుందని వెల్లడించింది. యువతి ఫిర్యాదు మేరకు పారడైస్ పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించిన పోలీసులు గాలింపు చేపట్టారు. 25 రోజులు కావొస్తున్న రియో ఆచూకీ లభించలేదని తెలిసింది. కుక్క ఆచూకీ తెలిపినవారికి 10 వేల రివార్డ్ ప్రకటించారు సదరు యువతి సాక్షి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఇంటి ముందు ఆపిన కారు.. ఎవరో మంత్రమేసినట్టు మాయమైంది.. ( వీడియో )
Viral Video: ఫుట్‌బాల్ మైదానంలో వ్యక్తి సడన్ ల్యాండింగ్..ప్లేయర్లు పరార్.. ( వీడియో )
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
