క్రికెట్ లైవ్ మ్యాచ్‌లో ..భూకంపంతో షేక్ అయిన గ్రౌండ్ వీడియో

Updated on: Nov 23, 2025 | 3:44 PM

సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లు వాన, వెలుతురు సరిపోకపోవడం, లేదా మైదానంలోకి కుక్కలు లాంటి జంతువులు రావడం వల్ల ఆగుతుంటాయి. కానీ బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన జరిగింది. భూకంపం కారణంగా మ్యాచ్‌ను కాసేపు ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనతో మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అంపైర్లు, కామెంటేటర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శుక్రవారం రోజు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో బంగ్లాదేశ్, ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మూడవ రోజు ఆట జరుగుతోంది. ఉదయం సుమారు 10:08 గంటలకు భూకంపం మొదలైంది. ఐర్లాండ్ జట్టు 55 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసిన సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.భూమి కదలడం గమనించిన ఆటగాళ్లు వెంటనే మైదానంలోనే కింద కూర్చుండిపోయారు. బౌండరీ దగ్గర ఉన్నవాళ్లు కూడా వికెట్ల దగ్గరికి వచ్చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్లేయర్లు కూడా గ్రౌండ్‌లోకి వచ్చేశారు. అదృష్టవశాత్తూ క్రికెట్ మైదానం చాలా బహిరంగ ప్రదేశం కాబట్టి, ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాదాపు 30 సెకన్ల పాటు భూకంపం ప్రకంపనలు కొనసాగాయి.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో