చాలు, చాల్లే.. ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్ నుంచి గెంటేసిన కోహ్లీ
భారత్ vs న్యూజిలాండ్ 3వ వన్డేలో డారిల్ మిచెల్ 137 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అతని ఇన్నింగ్స్ అనంతరం, విరాట్ కోహ్లీ మిచెల్‌ను సరదాగా వెనుక నుంచి నెట్టేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇది కోహ్లీలోని స్పోర్ట్స్ మ్యాన్ షిప్, చిలిపితనాన్ని స్పష్టంగా చాటుతుందని నెటిజన్లు ప్రశంసించారు. క్రికెట్‌లో ఇలాంటి దృశ్యాలు ఆట అసలు అందాన్ని పెంచుతాయని అభిమానులు అభిప్రాయపడ్డారు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఇండోర్‌లో జరిగిన మూడవ వన్డే మ్యాచ్ పరుగుల వర్షాన్ని కురిపించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేవలం 131 బంతుల్లోనే 137 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ బ్యాటింగ్ ధాటికి కివీస్ జట్టు భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. మూడవ వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన, సరదా సన్నివేశం చోటు చేసుకుంది.డారిల్ మిచెల్ ఆడుతున్న తీరును మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ నిశితంగా గమనించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనప్పటికీ, మిచెల్ చూపిన అసాధారణ పోరాట పటిమకు కోహ్లీ ఫిదా అయ్యాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో మిచెల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. మిచెల్ పెవిలియన్ వైపు వెళ్తుండగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న విరాట్ కోహ్లీ చప్పట్లు కొడుతూ అతన్ని అభినందించాడు. అయితే అక్కడితో ఆగకుండా, మిచెల్ దగ్గరకు వెళ్లి నవ్వుతూ అతన్ని వెనుక నుంచి నెడుతూ “ఇక చాలు వెళ్ళు” అన్నట్లుగా మైదానం బయటకు పంపించాడు. భారత్‌ను ఇంతసేపు ఇబ్బంది పెట్టినందుకు సరదాగా కోహ్లీ చేసిన ఈ పని కెమెరాకు చిక్కింది.విరాట్ కోహ్లీకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీలో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ షిప్, అతనిలోని చిలిపితనం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సీరియస్ గేమ్‌లో కూడా ఇలాంటి సరదా సన్నివేశాలు క్రికెట్ అసలైన అందాన్ని చాటుతాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rohit Sharma: రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్
పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్ ట్రైన్
ఇరాన్ లో పరిస్థితి దారుణం.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
Gold Price Today: ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు!
