Anushka Sharma-Virat Kohli: అల్‌రౌండర్ అనుష్కా శర్మ.. కోహ్లికి పొటీ ఇవ్వనుందా..?ఇండియా-బి కి కెప్టెన్‌గా అనుష్క శర్మ..(వీడియో)
అనుష్క శర్మ ఇరగదీసింది. తొలుత బ్యాటింగ్ లో 72 పరుగులు చేసిన ఆమె.. తర్వాత బంతితోనూ విజృంభించింది. ఐదు వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచింది. అంతే కాదండోయ్..
అనుష్క శర్మ ఇరగదీసింది. తొలుత బ్యాటింగ్ లో 72 పరుగులు చేసిన ఆమె.. తర్వాత బంతితోనూ విజృంభించింది. ఐదు వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచింది. అంతే కాదండోయ్.. ఫీల్డింగ్ లో పాదరసంగా కదులుతూ ఇద్దరు బ్యాటర్లను రనౌట్ చేసి తన జట్టును గెలిపించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అనుష్క శర్మ ఆటకు ఇప్పుడు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భవిష్యత్తులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులకు చెక్ పెట్టనుందని కామెంట్లు చేస్తున్నారు. ఇదేంటీ…‘విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క హీరోయిన్ కదా… ఆమె ఎప్పటి నుంచి క్రికెట్ ఆడటం ప్రారంభించింది’అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం..
ఈ పోస్ట్ విరాట్ భార్య గురించి కాదు. భారత అండర్- 19 మహిళల క్రికెట్ జట్టు బ్యాటర్ గురించి. ఆమె పేరు కూడా అనుష్కా శర్మనే కావడం ఇక్కడ అసలు మెలిక..రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా జరుగుతోన్న ఇండియా ఉమెన్స్ అండర్- 19 ఛాలెంజర్స్ ట్రోఫీలో అనుష్క 72 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అనుష్క ప్రస్తుతం ఇండియా ఉమెన్స్ అండర్- 19 ఛాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా- బి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది…నవంబర్2న ఇండియా- ఎ తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆల్‌రౌండ్ ప్రతిభను చూపింది.
ఇదిలా ఉండగా..బీసీసీఐ మహిళల ట్విట్టర్‌లో అనుష్కా శర్మ గురించి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కోహ్లీ భార్య ఎప్పటి నుంచి క్రికెట్ ఆడుతోంది’, ‘భార్యాభర్తలిద్దరూ క్రికెట్ గ్రౌండ్‌లో ఉంటే వామికను ఎవరు చూసుకుంటున్నారు ‘ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, మీమ్స్ పెడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…