ఏప్రిల్‌ 22 నుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌ వరకు వెళ్లవు

Updated on: Mar 28, 2025 | 6:46 PM

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభం కావడంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై రద్దీభారం పడకుండా దక్షిణమధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. కొన్ని రైళ్లను సికింద్రాబాద్‌ వరకు కాకుండా చర్లపల్లి వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దానిలో భాగంగా విశాఖ నుంచి ప్రయాణించే కొన్ని రైళ్లను వచ్చే నెల నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు కాకుండా చర్లపల్లి టెర్మినల్‌ రైల్వే స్టేషన్‌కు మళ్లిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

పూర్తిస్థాయిలో ఈ స్టేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. విశాఖ నుంచి హైదరాబాద్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సికింద్రాబాద్‌ స్టేషన్‌కు పంపకుండా చర్లపల్లి నుంచి వెళ్లేలా మళ్లించనున్నారు. ఇప్పటికే దీని మీద నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి నాలుగు రైళ్లను మళ్లిస్తుండగా వాటికి సికింద్రాబాద్‌ స్టేషన్‌ను తప్పించారు. లోకమాన్య తిలక్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు ఏప్రిల్ 22 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది. విశాఖపట్నం నుంచి లోకమాన్య తిలక్‌ వెళ్లే రైలు ఏప్రిల్ 24 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది. సంబల్‌పూర్‌-నాందేడ్‌ సూపర్ ఫాస్ట్ రైలు ఏప్రిల్ 25 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది. అలాగే నాందేడ్-సంబల్‌పూర్ సూపర్ ఫాస్ట్ రైలు ఏప్రిల్ 26 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది. ఇవి వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో సిగరెట్ వెలిగించి మహిళ.. ఒక్కసారిగా..!

భర్త హత్యకు స్కెచ్.. సుపారీలిచ్చి మరీ మ*ర్డర్స్.. ప్రాణాలు తీస్తున్న పక్క చూపులు

ఆ గెలాక్సీలో ఆక్సిజన్‌! 1,340 కోట్ల కాంతి సం.ల దూరంలో

జనాలను పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంట్లు..

టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. సానుభూతి తెలిపిన పవన్‌